స్నేహితుడికి జోడీగా స్నేహితురాలు!
వెండి తెరపై కొన్ని కాంబినేషన్లు చూడముచ్చటగా ఉంటాయి. అందులోనూ కొన్ని క్రేజీ కాంబినేషన్లు అంటే? ఇంకా ఆసక్తికరంగా అనిపిస్తుంది
వెండి తెరపై కొన్ని కాంబినేషన్లు చూడముచ్చటగా ఉంటాయి. అందులోనూ కొన్ని క్రేజీ కాంబినేషన్లు అంటే? ఇంకా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాంటి జోడీల్లో కార్తీక్ ఆర్యన్- సారా అలీఖాన్ జంట కూడా ఒకటి. ఇద్దరు తొలిసారి 'లవ్ ఆజ్ కల్' లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి ఆ జోడీ అంటే బాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.
అందుకు మరో కారణం కూడా ఉందండోయ్. ఇద్దరు మంచి స్నేహితులు కూడా. సినిమాల్లోకి రాకముందు నుంచే స్నేహితులు కావడంతో ఇద్దరి మధ్య తెరపై కెమిస్ట్రీ కూడా అంతే అద్భుతంగా పండుతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆ జోడీని ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. తాజాగా ఆ సమయం వచ్చేసినట్లు తెలుస్తోంది. 'భూల్ భులయ్య-3' కోసం ఆ ఇద్దర్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
భుల్ భులయ్య సీక్వెల్ హీరోగా కార్తీక్ ఆర్యన్ ని చాలా కాలం క్రితం ఫైనల్ చేసారు. కానీ అతనికి జోడీగా ఏ నాయికని తీసుకోవాలి? అన్న అంశంపై తర్జన భర్జన సాగుతోంది. ఈ నేపథ్యంలో సారా అలీఖాన్ అయితే బాగుంటుందని దర్శకుడు అనీస్ బజ్మీ సారాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి క్రేజీ కాంబినేషన్ వెండి తెరపై మెరవతబోతుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభిం చాలని సన్నాహాలు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్-కృష్ణకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సారా అలీఖాన్ 'యే వతన్ మేరా వతన్' చిత్రంలో నటిస్తోంది. అలాగే తెలుగు అవకాశం కోసం ఎదురు చూస్తోంది. సరైన ఛాన్స్ వస్తే స్నేహితురాలు జాన్వీ కపూర్ లా లాంచ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది. మరి ఆ ఛాన్స్ ఎప్పుడు తలుపు తడుతుందో చూడాలి