స్త్రీ-పురుషుల ORGAJAM పై శృంగార సినిమానా?
థాంక్యూ ఫర్ కమింగ్.. టైటిల్ ఆసక్తికరం. టైటిల్ కి తగ్గట్టే కంటెంట్ కూడా అంతే వేడి పెంచుతోంది.
థాంక్యూ ఫర్ కమింగ్.. టైటిల్ ఆసక్తికరం. టైటిల్ కి తగ్గట్టే కంటెంట్ కూడా అంతే వేడి పెంచుతోంది. నిజానికి వీర్యదానం కాన్సెప్టుతో విక్కీ డోనర్.. అబ్బాయే అమ్మాయిగా మారి కవ్విస్తే అనే కాన్సెప్టుతో డ్రీమ్ గర్ల్ ఫ్రాంఛైజీ వసూళ్లలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు అదే తరహాలో ఒక వైవిధ్యమైన కాన్సెప్టుతో రూపొందుతోంది థాంక్యూ ఫర్ కమింగ్. ఇంటర్ కోర్స్ సమయంలో 90శాతం మగవాళ్లు ఔట్ అయిపోతారు! కానీ ఆడాళ్లు మాత్రం 50శాతమే! అంటూ కాస్త హాటెస్ట్ కంటెంట్ తో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
తాజాగా చిత్ర కథానాయిక భూమి పెడ్నేకర్ థాంక్యూ ఫర్ కమింగ్ కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇన్ స్టాగ్రామ్‌లో భూమి తన పోస్టర్‌ను షేర్ చేసింది. ప్రారంభానికి ముందు ముగింపు ఉన్నప్పుడు.. #ThankYouForComingని చూడటం మర్చిపోవద్దు... అంటూ టీజింగ్ క్యాప్షన్ ని ఇచ్చారు. శృంగారం చేయక ముందే మగాళ్లు త్వరగా తేలిపోతున్నారని ఆడాళ్లు కొంచెం బెటర్ అని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు.
పోస్టర్‌లో భూమి రొమాంటిక్ గా కనిపిస్తోంది. తన బెడ్‌పై పడుకుని రసాస్వాధనలో ఆశ్చర్యకరమైన ఎక్స్ ప్రెషన్ తో కనిపించింది. సెప్టెంబర్ 6న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి ట్రైలర్ తో చాలావరకూ క్లారిటీ వచ్చేస్తుంది. డాలీ సింగ్, కుషా కపిల, శిబ్బేడీ, ప్రధుమాన్ సింగ్ మాల్, నటాషా రస్తోగి, గౌతమిక్, సుశాంత్ దివ్గీకర్, సలోని దైనీ, డాలీ అహ్లువాలియా, కరణ్ కుంద్రా, అనిల్ కపూర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) 2023లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది.
TIFFలో తన పనితనాన్ని ప్రదర్శించే అవకాశాన్ని అందుకున్నందుకు సంతోషించిన భూమి మాట్లాడుతూ హృదయానికి చాలా దగ్గరగా ఉండే చిత్రంతో నేను అక్కడకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది.. థాంక్స్ ఫర్ కమింగ్.. ప్రతిష్టాత్మకమైన రాయ్ థాంప్సన్ హాల్‌లో గాలా ప్రీమియర్‌కు మా సినిమా ఎంపికైంది అని తెలిపారు. ఇంత పెద్ద సినిమాని విభిన్న దేశాల ప్రేక్షకులతో నా చిత్రాన్ని చూడటం నేను ఎప్పుడూ ఎక్స్ పీరియెన్స్ చేయలేదు. అక్కడ రెడ్ కార్పెట్ పై నడవడానికి నా సహ నటులు, దర్శకుడు కరణ్ బూలానీ, మా నిర్మాతలు అనిల్ కపూర్ , రియా కపూర్ హాజరవుతున్నారు.. అని భూమి తెలిపింది. కరణ్ బూలానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.