సూపర్ బజ్.. బాలయ్యలో బిగ్ ఛేంజ్!
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అఖండతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య.. తనదైన శైలిలో మెప్పిస్తున్నారు. గత ఏడాది వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటసింహం.. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు తన 109వ సినిమా చేస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK 109 సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతోంది. అదే సమయంలో బాలయ్యకు సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా బాలయ్య.. మంచి రోజులు, ముహుర్తాల విషయంలో కరెక్ట్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఏదైనా ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేయాలనుకున్నా కూడా శుభ సమయాన్ని కచ్చితంగా చూసుకుంటారు.
ఇప్పుడు స్క్రిప్ట్ ల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాకే బాలయ్య నిర్ణయం తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బాలయ్య చాలా మారిపోయారని అంతా చెబుతున్నారు. ఒకప్పుడు తన వద్దకు వచ్చి ఎవరైనా దర్శకుడు కథ చెబితే వెంటనే ఓకే చెప్పేసేవారని, కానీ ఇప్పుడు అలా కాదని అంటున్నారు. అన్నీ విషయాల్లో కరెక్ట్ గా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. స్క్రిప్ట్ విన్నాక ఎస్ ఆర్ నో.. వెంటనే చెప్పేస్తున్నారని తెలుస్తోంది.
అదే సమయంలో ఒకవేళ స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. మార్పులు చేర్పులు చేయాలని బాలయ్య సూచిస్తున్నారని వినికిడి. గత ఏడాది ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమా విషయంలో అనిల్ రావిపూడి ఒకలా అనుకుంటే.. బాలయ్య మరోలా సజ్జెస్ట్ చేశారట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా బాలకృష్ణ ఛేంజ్ చేయించారని తెలుస్తోంది. ఇప్పుడు బాబీ మూవీ స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.
సినిమా స్క్రిప్ట్ లో రీసెంట్ గా మార్పులు చేర్పులు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే షూటింగ్ చేసిన కొన్ని సీన్స్ డిలీట్ చేసేశారట. స్కిప్ట్ లో ఛేెంజెస్ వల్ల మళ్లీ షూట్ చేస్తున్నారని సమాచారం. అందుకే ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుందని టాక్. మొత్తానికి బాలయ్య.. తన సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నమాట. మరి అప్ కమింగ్ మూవీస్ తో ఆయన ఎలాంటి హిట్లు అందుకుంటారో వేచి చూడాలి.