బిగ్ బాస్ 8 : నాగార్జున శాంతించినా బిగ్ బాస్ క్షమించలేదా..!

బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల మీద బిగ్ బాస్ మీద పంచులు వేస్తూ ఒక దశలో అభయ్ నవీన్ గీత దాటేశాడు.

Update: 2024-09-22 08:23 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో 3వ వారం ఎలిమినేటర్ గా అభయ్ నవీన్ పేరు వినిపిస్తుంది. దాదాపు అతనే ఈరోజు హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు సమాచారం. బిగ్ బాస్ లీక్స్ లో భాగంగా శనివారం నాడే ఆదివారం ఎపిసోడ్ షూట్ చేస్తారు కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది ముందు రోజే తెలుస్తుంది. ఐతే శనివారం ఎపిసోడ్ లో అభయ్ నవీన్ కి హోస్ట్ నాగార్జున రెడ్ కార్డ్ చూపిస్తూ హౌస్ నుంచి బయటకు వెళ్లాలని అన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల మీద బిగ్ బాస్ మీద పంచులు వేస్తూ ఒక దశలో అభయ్ నవీన్ గీత దాటేశాడు.

హౌస్ మెట్స్ అంతా నవ్వుతున్నారు కదా అని అభయ్ నవీన్ మరింత రెచ్చిపోయాడు. అంతేకాదు బిగ్ బాస్ తాను మాట్లాడేదంతా వేస్తాడో లేదో అంటూ చెలరేగిపోయాడు. కానీ తను అన్న మాటలు మొత్తం హౌస్ తో పాటు తను కూడా చూసేలా హోస్ట్ నాగార్జున ప్లే చేశాడు. అతను హౌస్ లో ఒక అనవసరమైన వ్యక్తిగా నాగార్జున సంబోధించాడు. ఐతే రెడ్ కార్డ్ వల్ల వెంటనే హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉన్నా తోటి హౌస్ మెట్స్ రిక్వెస్ట్ వల్ల అభయ్ ను హౌస్ లో ఉండేందుకు యాక్సెప్ట్ చేశారు.

ఐతే రెడ్ కార్డ్ ని వెనక్కి తీసుకున్నా సరే బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి అభయ్ నవీన్ ని తప్పించలేకపోయారు. 3వ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో అభయ్ కూడా ఉన్నాడు. అసలైతే నిఖిల్, అభయ్ లు చీఫ్ లుగా ఉండగా వారిలో ఒకరు సాక్రిఫైజ్ చేసి ఒకరిని సేవ్ చేసి మరొకరు నామినేషన్స్ లో ఉండాలి ఆ టైం లో నిఖిల్ ని సేవ్ చేసి అభయ్ నామినేషన్స్ లో ఉన్నాడు. అదే అతను చేసిన పొరపాటు.

ఈ వారం లీస్ట్ ఓటింగ్స్ లో ఉన్న అభయ్ నవీన్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. రెడ్ కార్డ్ చూపించినా నాగారున శాంతించినా సరే బిగ్ బాస్ క్షమించలేదు అతన్ని బయటకు పంపించేశాడు. ఐతే ఇది ఓటింగ్ వల్ల జరిగిన ఎలిమినేషనా లేదా అభయ్ ని కావాలనే హౌస్ నుంచి పంపించారా అన్నది మాత్రం తెలియదు. ఏది ఏమైనా అభయ్ నవీన్ 3 వారాల్లో ఆట కన్నా తన మాట ఎక్కువ వాడటం వల్లే ఇంత త్వరగా బయటకు వచ్చాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News