ఎరక్కపోయి ఇరుక్కుని.. సారీ చెప్పారు..!

ఐతే జరిగిన తప్పు తెలుసుకున్న ప్రియాంక, శివ కుమార్ తమ తప్పుని ఒప్పుకుని అందరికీ క్షమాపణలు చెప్పారు.

Update: 2024-12-03 16:44 GMT

సీరియల్స్, సోషల్ మీడియా ద్వారా కాస్త పాపులారిటీ తెచ్చుకుంటే చాలు మనం ఏం చేసినా చెల్లిపొతుంది అనుకుంటారు. ఐతే కొన్నిసార్లు మనం చేసిన అతి వల్ల ఊహించని విధంగా రిస్క్ లో పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒక సీరియల్ జంట అలాంటి రిస్క్ ను ఫేస్ చేస్తుంది. స్టార్ మా సీరియల్స్ తో సూపర్ పాపులర్ అయిన ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఫైనల్ వీక్ దాకా వచ్చ్చింది.

తన బోయ్ ఫ్రెండ్ శివ కుమార్ తో ప్రియాంకా యూట్యూబ్ లో రకరకాల వీడియోలు చేస్తుంది. వీరిద్దరు కలిసి చేసే ఫ్రాంక్ వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఐతే లేటెస్ట్ గా ఈ ఇద్దరు కలిసి అలిపిరి మెట్ల మార్గంలో పులి వచ్చింది అంటూ ప్రాంక్ చేశారు. కానీ ఆ ప్రాంక్ వల్ల చేసిన హాస్యం కాస్త అపహాస్యం అయ్యింది. తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతూ అది కూడా సీరియస్ ఇష్యూ అయిన పులి మీద ప్రాంక్ చేస్తారా అంటూ చాలామంది వారిని విమర్శించారు.

టీటీడీ కూడా రంగంలోకి దిగి వారి మీద చర్యలు తీసుకుంటుందని చెప్పుకున్నారు. ఐతే జరిగిన తప్పు తెలుసుకున్న ప్రియాంక, శివ కుమార్ తమ తప్పుని ఒప్పుకుని అందరికీ క్షమాపణలు చెప్పారు. మేము అది కావాలని చేయలేదని అది సరదాగా చేశాం కానీ అది ఇంతమందిని బాధపెడుతుందని అనుకోలేదని. మా తప్పుని మన్నించమని.. ఇక మీదట మేము అలా చేయమని అన్నారు. అంతేకాదు మేము కూడా శ్రీవారి భక్తులమే అని.. దేవుడి విషయంలో ఇక మీదట ఎలాంటి ప్రాంకులు చేయమని అన్నారు.

ఈ క్షమాపణ వీడియోతో వారి మీద టీటీడీ యాక్షన్ తీసుకోవడం ఆపేస్తుందా.. లేదా తిరుమల గురించి ఎవరు ఇక మీదట ప్రాంకులు చేయకుండా సీరియన్స్ రూల్స్ ని తెస్తారా లాంటి విషయాలు తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ వెళ్లకముందే చాలా పాపులర్ అయిన ప్రియాంక సీజన్ 7 లో తన ఆటతో అందరినీ మెప్పించింది. ఐతే రీసెంట్ గా సీజన్ 8 లో ఆమె టికెట్ టు ఫినాలె టాస్క్ లో మరో కంటెస్టెంట్ మానస్ తో అలా వెళ్లి ఇలా వచ్చింది. ఈ షాక్ వల్ల ఇక మీదట శివ కుమార్, ప్రియాంక లు ప్రాంక్ ల విషయంలో చాలా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు.

Tags:    

Similar News