బిగ్ బాస్ 8 : ఫైనల్లీ ఆ కంటెస్టెంట్.. టాటా బై బై..!

బిగ్ బాస్ సీజన్ 8 లో నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది ఇప్పటిదాకా సస్పెన్స్ నడిచింది.

Update: 2024-09-28 14:12 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది ఇప్పటిదాకా సస్పెన్స్ నడిచింది. ఈ వారం ఎలిమినేషన్ ఉండదని కేవలం సీక్రెట్ రూమ్ కు కంటెస్టెంట్ ని పంపిస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ బిగ్ బాస్ సీజన్ 8 ఎవరు ఊహలకు అందకుండా చేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఆదిత్య ఓం, సోనియా, ప్రేరణ, పృధ్వి, నబీల్ ఇంకా మణికంఠ ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన వారిని సీక్రెట్ రూం లో వేస్తారని వార్తలు వచ్చాయి.

కానీ లేటెస్ట్ బిగ్ బాస్ లీక్స్ ప్రకారం హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ డైరెక్ట్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఐతే ఆదివారం ఎపిసోడ్ లో జరగే ఎలిమినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ లీక్స్ ద్వారా బయటకు వస్తాయి. సో సోనియా ఎలిమినేషన్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పొచ్చు. హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి సోనియా నిఖిల్, పృధ్విలతోనే కలిసి ఉంటుంది.

వాళ్లిద్దరిని ఎమోషనల్ గా బ్లాక్ చేసి ఆమె చుట్టే తిప్పుకునేలా చేసుకుంది. అంతేకాదు వారిద్దరి మధ్యే ఉంటూ టాస్కుల్లో ఆమె అసలేమాత్రం పెర్ఫార్మ్ చేయలేకపోతుంది. అది సోనియాకు మైనస్ గా మారింది. మరోపక్క ఆమెను ఎవరైనా టార్గెట్ చేస్తే ఆమె కన్నా ముందే నిఖిల్, పృధ్విలు మాట్లాడుతున్నారు. ఇది ఆమెకు బయట చాలా వ్యతిరేకత ఏర్పడేలా చేసింది.

బిగ్ బాస్ 8 లో సోనియా చివరి వారం వరకు అంటే టాప్ 5 వరకు కొనసాగుతుందని మొదట అనుకున్నారు. కానీ ఆమె హౌస్ లో ఆట కన్నా నిఖిల్, పృధ్విలతో టైం స్పెండ్ చేయడమే ఎక్కువ అయ్యింది. హౌస్ అంతా ఒకవైపు నిఖిల్, పృధ్వి, సోనియా ఒకవైపు అనిపించేలా చేశారు. అందుకే సోనియా మీద కాస్త నెగిటివిటీ ఏర్పడింది. ఈ వారం ఆమె నామినేషన్స్ లో ఉందని ఆర్జీవి కూడా సోనియాకు సపోర్ట్ గా ఉండాలని ట్వీట్ చేశారు. కానీ అది ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదని అనిపిస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 8 నుంచి నిజంగానే సోనియా ఎలిమినేట్ అయ్యిందా అన్నది ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Tags:    

Similar News