బిగ్ బాస్ 8 : రాయల్ వర్సెస్ ఓజీ.. నామినేషన్స్ లో కూడానా..?

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన కంటెస్టెంట్స్ ని రాయల్ క్లాన్ గా పేరు పెట్టిన బిగ్ బాస్ ఆల్రెడీ హౌస్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ ని ఓజీగా కొనసాగించారు

Update: 2024-10-23 05:39 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన కంటెస్టెంట్స్ ని రాయల్ క్లాన్ గా పేరు పెట్టిన బిగ్ బాస్ ఆల్రెడీ హౌస్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ ని ఓజీగా కొనసాగించారు. ఐతే ప్రతి టాస్క్ ని రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ క్లాన్ అన్నట్టుగా ఇస్తున్న బిగ్ బాస్ ఈ రెండు క్లాన్స్ మధ్య సాధ్యమైనంత వరకు గొడవలు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనిపిస్తుంది. రాయల్ క్లాన్ లో అందరు బాగానే టాస్కుల్లో క్లాన్ వైజ్ ఆడుతున్నా కొందరు మాత్రం పేరుకే గ్రూప్ కానీ తమ ఆటంతా తమ పర్సనల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 8 లో రాయల్ క్లాన్స్ వ్యవహరిస్తున్న తీరు ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తుంది. ఆల్రెడీ బయట ఐదు వారాలా ఆట చూసి వచ్చిన వీరు ఎందుకు కొందరిని కావాలని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా రాయల్ క్లాన్ సభ్యులు కొందరు సేఫ్ గేం ఆడుతూ మంచి వారనిపించుకోవాలని చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో రెండు క్లాన్స్ మధ్య ఫైట్ తెలిసిందే. ప్రతి టాస్క్ వారి మధ్యే జరుగుతుంది.

ఐతే రాయల్ క్లాన్ వచ్చినప్పటి నుంచి జరిగిన నామినేషన్స్ అంతా కూడా రాయల్ క్లాన్ సభ్యులు మాక్సిమం ఓజీ క్లాన్ సభ్యులకే వేస్తున్నారు తప్ప సొంత రాయల్ క్లాన్ మెంబర్స్ కి వేయట్లేదు. ఏదో ఈ వారం హరితేజ, నబీల్ మెహబూబ్ కి వెశారని అతను కూడా తిరిగి రాయల్ క్లాన్ మెంబర్స్ అయిన హరితేజ, నయని పావనిలకు వేశాడు తప్ప గత రెండు వారాలు మాత్రం సొంత క్లాన్ సభ్యులు వారిని నామినేట్ చేయలేదు.

వైల్డ్ కార్డ్ గా వచ్చిన రాయల్స్ మనం హౌస్ లో ఉండి ఆ ఓజీ క్లాన్ మెంబర్స్ అందరినీ ఇంటికి పంపిచేద్దాం అన్న ప్లానింగ్ లో ఉన్నారు కావొచ్చు కానీ ఆడియన్స్ ఎవరు ఆట ఆడతారో వారినే సేవ్ చేస్తారని గుర్తుంచుకోవాల్సిందే. ఈ వారం నామినేషన్స్ లో రాయల్ క్లాన్ నుంచి హరితేజ ఉంది కానీ మెగా చీఫ్ అయిన గౌతం ఆమెకు నామినేషన్ షీల్డ్ ఇచ్చి ఆమెను సేవ్ చేశాడు. మొత్తానికి హౌస్ లో రాయల్ క్లాన్ సెపరేట్ గేం ప్లాన్ తో ఉందని అర్ధమవుతుంది. ఐ ఓజీ క్లాన్ మెంబర్స్ అర్ధం చేసుకుని ఆడితే బాగుంటుంది.

Tags:    

Similar News