బిగ్ బాస్ 8 : టైటిల్ రేసులో ఉన్న కంటెస్టెంట్ కి ఈ తికమక తగునా..?
బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ రేసులో ఉన్న నిఖిల్ మొదటి ఐదారు వారాలు తన ఆట తను ఆడుతూ మంచి ఫైటింగ్ స్పిరిట్ తో కనిపించాడు.
బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ రేసులో ఉన్న నిఖిల్ మొదటి ఐదారు వారాలు తన ఆట తను ఆడుతూ మంచి ఫైటింగ్ స్పిరిట్ తో కనిపించాడు. ఐతే వారాలు గడుస్తున్నా కొద్దీ హౌస్ లో తన ఆట సన్నగిల్లుతూ వచ్చింది. గత రెండు వారాలుగా అయితే నిఖిల్ ఆట పడిపోయింది. ఫ్యామిలీ వీక్ లో నిఖిల్ మదర్ తో పాటు ఆ వీకెండ్ వచ్చిన తన ఫ్రెండ్స్ కూడా ఇంకాస్త గట్టి ఎఫర్ట్ పెట్టమని చెప్పారు.
ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చి నామినేషన్స్ వేయాలి. ఈ క్రమంలో నిఖిల్ ఆటపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నామినేట్ చేశారు. మణికంఠ, బేబక్క, సోనియా నిఖిల్ ని నామినేట్ చేశారు. ఐతే నిఖిల్ ని నామినేట్ చేయలేదు కానీ సీత మాత్రం నిఖిల్ ట్రాప్ లో పడొద్దు అతను స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ల వెనకాల తిరిగేలా చేస్తాడని చెప్పింది.
దాని మీద నిఖిల్ బాగా అప్సెట్ అయ్యాడు. యష్మి ని అడ్డు పెట్టుకుని సీత తన మీద ఒక పెద్ద అపోహ వేసి వెళ్లిందని నిఖిల్ బాధపడ్డాడు. ఆ టైం లో నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ నైట్ అన్నం కూడా తినకుండా పడుకున్నాడు. ఐతే నిఖిల్ ఆ టైంలోనే తను ఇక మీదట హౌస్ లో ఉండదలచుకోలేదని. తనకు ఓట్ వేయొద్దని ఆడియన్స్ కు చెప్పాడు. ఆ తర్వాత నబీల్, పృధ్వి వచ్చి నిఖిల్ బ్రెయి వాష్ చేశారు. నీ ఆట నువ్వు ఆడు తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.
అప్పుడు మనసు మార్చుకున్న నిఖిల్ వాష్ రూం లో మళ్లీ వేరే కెమెరాకు సారీ ఆడియన్స్ ఇందాకా ఓట్ వేయొద్దని చెప్పాను. నేను గివ్ అప్ ఇవ్వను కచ్చితంగా ఇక్కడ వాటికి ఇక్కడే ఆన్సర్ ఇస్తానని అన్నాడు. ఐతే అంతకుముందు కెమెరాతో తనకు ఓట్ వేయొద్దని ఆడియన్స్ కు చెప్పిన తనే మళ్లీ తనకు ఓట్ వేయండని చెప్పడం నిఖిల్ ఒక మాట మీద గట్టిగా ఉండలేకపోతున్నాడు అన్నది అర్ధమవుతుంది.
టైటిల్ రేసులో ఉన్న ఒక వ్యక్తి ఇలా తక్కువ టైంలో తన మనసు మార్చుకోవడం ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. నిఖిల్ తో పాటుగా గౌతం టైటిల్ రేసులో ఉన్నాడు. వైల్డ్ కార్డ్ గా వచ్చిన గౌతం అనూహ్యంగా తన ఆటని పెంచుకుని టైటిల్ పోటీలో నిలిచాడు. మరి నిఖిల్ ఇలానే డబుల్ స్టాండర్డ్ గా ఉంటే మాత్రం అతనికి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. మరి నిఖిల్ ఈ విషయంలో తనని తాను స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అతనికి ఓట్ వేసే ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు.