3390 కోట్ల నికర ఆస్తులతో దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్?
బచ్చన్ కుటుంబంలో అత్యధికంగా సంపాదిస్తున్న ప్రముఖుడు అమితాబ్ బచ్చన్. లెజెండరీ నటుడు ప్రతి నెలా 5 కోట్లు సంపాదిస్తున్నాడు.
అమితాబ్ బచ్చన్ తన 81వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సమయంలో సాధారణంగా ప్రతి భారతీయుడి ఆలోచనా అమితాబ్ పదవీ విరమణకు రెడీ అవ్వాల్సిన సమయమిదే. కానీ అక్షరాలా అది తప్పు. బాలీవుడ్ పెహన్‌షా అమితాబ్ తన అభిమానులు ఫాలోవర్లందరికీ ఒక ప్రేరణగా నిలుస్తున్నారు. బిగ్ బి ABCL కార్పొరేషన్ పరాజయం తర్వాత 2000లో తన కెరీర్‌ను పునరుద్ధరించాడు. ఈ రోజు తన వయస్సును పట్టించుకోకపోతే బాలీవుడ్ లో అత్యంత బిజీ నటుడు. అంతేకాదు.. సంపాదన పరంగా చూస్తే.. అమితాబ్ ఆదాయం తన కొడుకు కూతురు సహా ఇతర కుటుంబీకుల కంటే చాలా ఎక్కువ.
బచ్చన్ కుటుంబంలో అత్యధికంగా సంపాదిస్తున్న ప్రముఖుడు అమితాబ్ బచ్చన్. లెజెండరీ నటుడు ప్రతి నెలా 5 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన వార్షిక ఆదాయం దాదాపు 60 కోట్లు. ఇప్పటివరకు మెగాస్టార్ అమితాబ్ నికర ఆదాయ విలువ 3390 కోట్లు. మిస్టర్ బచ్చన్ నేటితరం తో పోలిస్తే.. అన్ని విధాలుగా స్పూర్తినిస్తూ .. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించారు.
అమితాబ్ 80 ప్లస్ వయసులో ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. బచ్చన్ జీ తదుపరి బ్రహ్మాస్త్ర పార్ట్ 2 , పార్ట్ 3లో కనిపిస్తాడు. ప్రభాస్ - దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2989ADలో కూడా బిగ్ బి ముఖ్యమైన భాగం. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 15కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బి తర్వాత ఆయన కోడలు, బాలీవుడ్ కథానాయిక ఐశ్వర్య రాయ్ టాప్ ఎర్నర్ గా ఉన్నారు. ఐశ్వర్యారాయ్ నికర ఆస్తుల విలువ 823 కోట్లు. ఐష్ ప్రతి చిత్రానికి 10 కోట్లు తీసుకుంటుంది. ఎండార్స్‌మెంట్లతో వార్షిక ఆదాయం సంవత్సరానికి 50 కోట్లు. జయ బచ్చన్..ఇటీవలే విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో నటించారు. ఇందలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జయాజీ నికర ఆస్తుల విలువ 640 కోట్లు.
అభిషేక్ బచ్చన్ సంపాదన ఆ ఇద్దరి తర్వాతే. జూనియర్ బచ్చన్ ప్రతి విడుదలతో నెమ్మదిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. అతడికి సంవత్సరానికి 24 కోట్ల సంపాదన ఉంది. నెలవారీ దాదాపు రూ. 2 కోట్లు సంపాదిస్తున్నాడు. బచ్చన్ కుటుంబం పరిశ్రమలో అత్యంత ప్రియమైన గౌరవనీయమైన కుటుంబాలలో ఒకటి. వారు తరచుగా సూరజ్ బర్జాత్యా చిత్రం `హమ్ సాథ్ సాథ్ హై`కి స్టింట్ కి కారకులుగా నిలుస్తున్నారు.