లైంగిక వేధింపులు ఎదురయ్యాయి.. సీనియర్ నటి..!
ఇన్నేళ్ల కెరీర్ లో ఎవరి నుంచైనా వేధింపులు ఎదురయ్యాయా? అని హోస్ట్ ప్రశ్నించారు.
రెండున్నర దశాబ్ధాలుగా బిపాసా బసు సినీరంగంలో కొనసాగుతున్నారు. నటిగా, నిర్మాతగా చిత్రసీమకు సుపరిచితురాలు. భర్త కరణ్ సింగ్ గ్రోవర్, పిల్లలతో వ్యక్తిగతంగా సంతోషకర జీవనాన్ని సాగిస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో హోస్ట్ నుంచి ఒక తీవ్రమైన ప్రశ్న ఎదురైంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఎవరి నుంచైనా వేధింపులు ఎదురయ్యాయా? అని హోస్ట్ ప్రశ్నించారు.
దానికి సమాధానంగా.. తన చిన్న వయసులో నిర్మాత నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని బిపాసా అన్నారు. బిపాసా మాట్లాడుతూ-''నేను చిన్న అమ్మాయిని.. ఒంటరిగా ఉంటున్నాను. అగ్ర నిర్మాత సినిమాకి సంతకం చేసినప్పుడు ఒక ఘటన జరిగింది. నేను ఇంటికి తిరిగి వచ్చాను. అతడి నుండి 'మిస్సింగ్ యువర్ స్మైల్' అని నాకు టెక్స్ట్ సందేశం వచ్చింది. నేను చాలా చిన్నమ్మాయిని. నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. కానీ నేను పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అతడు మళ్లీ అదే సందేశాన్ని నాకు పంపాడు.
కాంట్రాక్ట్ సంతకం సమయంలో కొన్ని సెకన్ల పాటు తనను కలిసిన వ్యక్తి తనకు అలాంటి మెసేజ్‌లు పంపడం విడ్డూరంగా ఉందనిపించింది. నేను నా సెక్రటరీని పిలిచి ఈ నిర్మాత చిరునవ్వును ఎందుకు కోల్పోతున్నాడు? అని అడిగాను ... నేను నా స్నేహితుడికి సందేశం పంపాను. అతడు చెప్పిన దానిని బట్టి నిర్మాత ఉద్ధేశం అర్థమైంది. ఆ తర్వాత ఇక అతడితో సినిమాకు పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కి ఇవ్వమని నా సెక్రటరీకి చెప్పాను. ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ వెనక్కి తీసుకోలేదు. .. అని నాటి సంగతులను గుర్తు చేసుకుంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. బిపాసా బసు ప్రస్తుతం ఎం.ఎక్స్ ప్లేయర్స్ 'డేంజరస్'లో భర్త, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి కనిపించింది. ఈ సిరీస్‌కి విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు.