వాళ్ల‌కు బాలీవుడ్ కంటే టాలీవుడ్డే బెట‌రా?

బాలీవుడ్ స్టార్ హీరోల నుంచి విల‌న్ల వ‌ర‌కూ అంతా ఇప్పుడు తెలుగు స‌హా సౌత్ సినిమాల‌వైపే చూస్తున్నారన్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం.

Update: 2024-11-04 05:43 GMT

బాలీవుడ్ స్టార్ హీరోల నుంచి విల‌న్ల వ‌ర‌కూ అంతా ఇప్పుడు తెలుగు స‌హా సౌత్ సినిమాల‌వైపే చూస్తున్నారన్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. పాన్ ఇండియాలో టాలీవుడ్..కోలీవుడ్ సినిమాకి ఉన్న క్రేజ్ అలాంటిది మ‌రి. అందుకే ఇప్పుడు హిందీ న‌టులంతా ఇటువైపుగా చూస్తున్నారు. ఇప్ప‌టికే సైఫ్ అలీఖాన్, బా బీ డియోల్, ఇమ్రాన్ హష్మీ, దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ తారలు భారీ బడ్జెట్ సౌత్ సినిమాల్లో భాగ‌మైన సంగ‌తి తెలిసిందే.

మ‌రి ఈ సినిమాల ద్వారా వీళ్ల‌కు జ‌రిగిన మేలు ఎంటో తెలుసా? వాళ్లు పోషించిన పాత్ర‌ల‌కు ఊహించిన దానికంటే అధిక పారితోషికం...పాన్ ఇండియా లో గుర్తింపు...ప్ర‌త్యేకంగా సౌత్ లో బాగా ఫేమ‌స్ అవ్వ‌డం అన్న‌ది జ‌రిగింది. పైగా వాళ్లు న‌టించిన సినిమాల‌కు హిందీ సినిమాల త‌ర‌హాలో ఎక్కువ కాల్షీట్లు కూడా కేటాయించ‌లేదు. ప‌ని త‌క్కువ పారితోషికం ఎక్కువ అన్న‌ట్లు వాళ్ల ట్యాలెంట్ స‌హా మార్కెట్ ని మించి వాళ్ల‌కు పారితోషికాలు చెల్లించారు.

ఒక స్టార్ బాలీవుడ్ సినిమాల‌కు రెండు..మూడు నెల‌లు డేట్లు కేటాయిస్తుంటే.. సౌత్ సినిమాల‌కైతే 30 రోజులు కేటాయిస్తే చాలు ప‌ని పూర్త‌వుతుంది. ప‌ని త‌క్కువ‌. పారితోషికం ఎక్కువ గా దక్కుతుంది ఇక్క‌డ‌. మ‌రి ఇలాంటి న‌టుల్ని పెట్టుకుని సౌత్ మేక‌ర్స్ సాధించింది ఏంటి? అంటే బాలీవుడ్ ముఖాలను కలిగి ఉండటం తో హిందీ మార్కెట్ ఈజీ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌కు సునాయాసంగా క‌నెక్ట్ అవుతున్నారు.

ఆ ర‌కంగా బాలీవుడ్ తార‌లు సౌత్ సినిమాకి అద‌న‌పు అస్సెట్ గా నిలుస్తున్నారు. త‌ద్వారా దక్షిణాది చిత్ర నిర్మాతలు తమ చిత్రాల పరిధిని హిందీ బెల్ట్‌లలో విస్తరించడానికి ఒక గేట్ వేగా క‌నిపిస్తున్నారు. థ్రియేట్రిక‌ల్ అమ్మ‌కాల‌తో పాటు ఓటీటా మార్కెట్ లోనూ ప్ల‌స్ అవుతున్నారు. ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చంద‌గా బాలీవుడ్ తార‌ల‌తో సౌత్ మేక‌ర్లు వ‌ర్కౌట్ చేస్తున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మీ, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ వంటి స్టార్లు సౌత్ సినిమాల‌తోనే త‌మ కెరీర్ ల‌ను పున‌రిద్దించుకున్నారు అన్న‌ది వాస్త‌వం. సంజయ్ దత్ `కేజీఎఫ్`, లియోలో నటించగా, సైఫ్ అలీ ఖాన్ ` దేవర, బాబీ డియోల్ `కంగువ`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News