పిక్‌టాక్ : 50 ఏళ్లకు చేరువైనా బాబోయ్ ఇదేం అందం
పవన్ కళ్యాణ్‌తో దాదాపు పాతికేళ్ల క్రితం 'బద్రి' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అమీషా పటేల్.
పవన్ కళ్యాణ్‌తో దాదాపు పాతికేళ్ల క్రితం 'బద్రి' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అమీషా పటేల్. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ బాలీవుడ్‌కే ఈ అమ్మడు పరిమితం అయ్యింది. తెలుగులో బద్రి తర్వాత నాని సినిమాలో నటించింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరచడం మాత్రమే కాకుండా అమీషా పటేల్ పాత్రపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో నరసింహుడు సినిమాలో నటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ తెలుగులో ఈమె నటించలేదు. బాలీవుడ్‌లో మాత్రం ఈమె జోరు కంటిన్యూ అవుతూనే ఉంది.
ఇండస్ట్రీలో అడుగు పెట్టి పాతికేళ్లు కావస్తుండగా, ఈమె వయసు అయిదు పదులకు చేరువ అయ్యింది. సాధారణంగా అయిదు పదుల వయసుకు చేరిన హీరోయిన్స్ పెద్దగా బయట కనిపించరు. కానీ అమీషా పటేల్ మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా వైరల్ అవుతూనే ఉంది. ఈ వయసులోనూ బికినీ వేసుకోవడం, స్విమ్ సూట్‌లో కనిపించడం, స్కిన్ షో చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈసారి టైట్ షార్ట్ ధరించడంతో పాటు స్పోర్ట్స్ బ్రా ధరించింది. ఈ వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉన్న అమీషా పటేల్ చాలా మందిని నోరు వెళ్లబెట్టేలా చేసింది.
అమీషా పటేల్ ఈ ఏడాదిలోనూ ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు ముందు మరిన్ని సినిమాలు ఈ అమ్మడి నుంచి వస్తాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న అమీషా పటేల్ అంటే ఇప్పటికీ హిందీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్‌లోనూ మంచి డిమాండ్ ఉంది. తెలుగులోనే కాకుండా తమిళ్‌లో ఈమె సినిమాను చేసింది. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చి వరుసగా ఆఫర్లు వచ్చినా హిందీ సినిమా ఇండస్ట్రీకే ఈమె పరిమితం అయ్యింది. ఇప్పటికీ ఈమె కోరుకుంటే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే అవకాశాలు వస్తాయి.
తన వయసుకు తగ్గ పాత్రలను పోషించడం ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. గత ఏడాది ఈమె నటించిన గదర్ 2 సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు పలు ఆఫర్లు తెచ్చి పెట్టింది. కానీ ఈమె మాత్రం ఆచితూచి సినిమాల ఎంపిక చేసుకుంటుంది. ఇండస్ట్రీలో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు తక్కువ అయినా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో కన్నుల విందు చేస్తుంది. తాజా ఫోటోలు చూస్తూ చాలా మంది ఈమె వయసు 50 ఏళ్లకు దగ్గరకు వచ్చింది అంటే నమ్మడానికి లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో పదేళ్లు అయినా అమీషా పటేల్ ఇదే స్థాయి అందంగా కనిపిస్తుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.