బెడ్‌పై చెమ‌ట‌లు ప‌ట్టించిన సీనియ‌ర్ న‌టి

`మెరుపు క‌ల‌లు` చిత్రంలో అర‌వింద స్వామి, ప్ర‌భుదేవా లాంటి స్టార్ల‌తో క‌లిసి న‌టించింది బాలీవుడ్ అందాల న‌టి కాజోల్.

Update: 2024-10-22 16:30 GMT

`మెరుపు క‌ల‌లు` చిత్రంలో అర‌వింద స్వామి, ప్ర‌భుదేవా లాంటి స్టార్ల‌తో క‌లిసి న‌టించింది బాలీవుడ్ అందాల న‌టి కాజోల్. షారూఖ్‌తో డీడీఎల్‌జే సుంద‌రిగా దేశ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. కానీ ద‌క్షిణాదిన మెరుపుక‌ల‌లు చిత్రంలోని ఒకే ఒక్క పాట (ఓ వాన ప‌డితే ఆ కొండ కోన హాయి)తో ఒక వేవ్ లా మారింది. కానీ కాజోల్ బాలీవుడ్ కి మాత్ర‌మే ప‌రిమితమై చాలా సినిమాల్లో న‌టించింది.


కాజోల్ చాలా కాలం త‌ర్వాత సౌత్ లో ధ‌నుష్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం హిందీ చిత్ర‌సీమ‌లో త‌న ఇన్నింగ్స్ ని సీరియ‌స్ గా కొన‌సాగిస్తోంది. ఇటీవ‌ల‌ కాజోల్ జైపూర్‌లో తన త‌దుప‌రి చిత్రం `దో పట్టి` ప్రమోషన్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా కాజోల్ లుక్ అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సీనియ‌ర్ భామ‌ ఎంబ్రాయిడరీ ప్యాంట్‌సూట్‌లో మేజర్ బాస్ లేడీ వైబ్స్‌ని వెద‌జ‌ల్లింది. ఈ లుక్ ని వర్ణిస్తూ `ఇది అందానికి సంబంధించిన విషయం`గా కాజోల్ పేర్కొంది. కాజోల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. కాజోల్ మంచం మీద అలా రిలాక్స్ డ్ గా సేద‌దీరుతూ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ఐవరీ షేడెడ్ ఫ్లోరల్ ప్యాంట్‌సూట్ ధ‌రించిన‌ కాజోల్ ఎంతో అందంగా క‌నిపించింది. పోనీటైల్, రెట్రో సన్ గ్లాసెస్ తో సీనియ‌ర్ న‌టి మ‌రింత‌ స్టైలిష్ గా క‌నిపించింది.


ఈ నెల ప్రారంభంలో `దో పట్టి` ట్రైలర్ లాంచ్ సందర్భంగా కాజోల్ మీడియా అడిగిన ఓ స‌ర‌దా ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చింది. మీ ఇంట్లో అసలు `సింగం` ఎవరు? అంటూ కాజోల్ ని మీడియా ప్ర‌శ్నించ‌గా, కాజోల్ సరదాగా తనవైపు చూపిస్తూ ఇలా చెప్పింది. `నేనే నిజమైన సింగం` అని ఈవెంట్‌లో చాలా సార్లు చెప్పాను... నిజ‌ జీవితంలో! అని ముగించింది. దీనిని బ‌ట్టి ఇంట్లో కాజోల్ సింగం అయితే తెర‌పై దేవ‌గ‌న్ సింగం అని అంతా అర్థం చేసుకున్నారు. యాధృచ్ఛికంగా దో ప‌ట్టీలో కాజోల్ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, అదే స‌మ‌యంలో సింగం సిరీస్ లో దేవ‌గ‌న్ పోలీస్ అధికారిగానే న‌టించారు.


కృతి సనన్ - షహీర్ షేక్ త‌దిత‌రులు నటించిన `దో పట్టి`లో కాజోల్ పోలీస్ అధికారిగా మెరిపించ‌బోతోంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన `దో పట్టి`తో కృతి సనన్ నిర్మాతగా అరంగేట్రం చేస్తోంది. అక్టోబర్ 25న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ఈనెల‌ 20న షారుఖ్ ఖాన్- కాజోల్ జంట‌గా నటించిన కల్ట్-క్లాసిక్ మూవీ `దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే` 29 సంవత్సరాల వేడుకను జరుపుకుంది. ఆ స‌మ‌యంలో మూవీ నుంచి అంద‌మైన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది.

Tags:    

Similar News