వోగ్ క‌వ‌ర్ షూట్: ర‌చ్చ లేపిన ప్రియాంక చోప్రా

ఇటీవ‌లే త‌న సోద‌రుడి నిశ్చితార్థ‌ వేడుక‌ కోసం ప్రియాంక చోప్రా భారతదేశానికి విచ్చేసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-30 04:34 GMT

ఇటీవ‌లే త‌న సోద‌రుడి నిశ్చితార్థ‌ వేడుక‌ కోసం ప్రియాంక చోప్రా భారతదేశానికి విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. నీలం ఉపాధ్యాయతో తన తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే జంట‌ను ధీవించారు. త‌న‌ దివంగత తండ్రి జన్మదినోత్సవం వేడుక‌ల‌తో పాటు.. ఈ నిశ్చితార్థాన్ని కూడా పీసీ ఏక‌కాలంలో క‌వ‌ర్ చేసింది. ప్రియాంక తన త‌దుప‌రి మరాఠీ ప్రొడక్షన్ `పానీ` ప్రమోషనల్ ఈవెంట్‌కు కూడా హాజరయ్యారు. తదుపరి `ది బ్లఫ్ అండ్ హెడ్స్ ఆఫ్ స్టేట్‌`లో పీసీ కనిపించనుంది. న‌టిగా మ‌ళ్లీ బిజీ కానుంది.


ఇంత‌లోనే పీసీ పాపుల‌ర్ వోగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ సూట్ పై మెరిసింది. వోగ్ కోసం కొత్త ఫోటోషూట్‌లో పీసీ ఎంతో ఎన‌ర్జిటిక్ గా క‌నిపించింది. ఈసారి ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో పీసీ ఎంతో వైబ్రేంట్ గా క‌నిపించింది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేష‌న్ డిజైన‌ర్ దుస్తుల్లో పీసీ ఎంతో డ్యాషింగ్ గా క‌నిపించింది. ప్రియాంక తన వోగ్ ఫోటోషూట్ నుండి కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోషూట్ లోని మొదటి ఫోటోలో, పీసీ అపారదర్శక వైట్ టాప్ ధ‌రించింది.. కెమెరాకు దూరంగా నిరాడంబరమైన యువరాణిలా కనిపించింది. త‌దుపరి లెఫ్ట్ ఫేసింగ్ క్లోజ్-అప్ షాట్ లో క‌నిపించ‌గా, మూడవ ఫోటోలో పీసీ ఒక గోడకు ఎదురుగా క‌నిపించింది. ఎర్రటి తెరలు అక్క‌డ‌ వేలాడుతూ క‌నిపించాయి. పీసీ తెల్లటి చొక్కా, నల్లటి స్కర్ట్ తో యూనిక్ గా క‌నిపించింది. పీసీ ఒక ప్ర‌త్యేక‌మైన కాషాయ రంగు డిజైన‌ర్ డ్రెస్ లోను ఎంతో అందంగా క‌నిపించిన ఫోటో కూడా వైర‌ల్ గా మారుతోంది.


ప్రియాంక ఈ పోస్ట్‌కి ఆస‌క్తిక‌ర‌ క్యాప్షన్ ఇచ్చింది ``చాలా నిస్పృహ, చాలా బుద్ధిపూర్వక ఫోటోషూట్... వోగ్ ఇండియా 2024. భారతదేశంలోని అత్యుత్తమ డిజైనర్లు- సావియో జోన్, అమిత్ అగర్వాల్, తరుణ్ తహిలియాని, వరుణ్ బహ్ల్, ఫల్గుణి షేన్ పీకాక్, రీ-సెరిమోనియల్ , అష్దీన్‌ల డిజైన్ల‌ను ధరించడం, అందమైన, అనుకూలమైన సృష్టి`` అని రాసారు. దీనికి ప్రియాంక భర్త నిక్ జోనాస్ స్పందిస్తూ ``వావ్ వావ్ వావ్`` అని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News