బుట్టబొమ్మ 2.ఓ..మత్తెక్కిస్తోన్న బ్యూటీ!
దీంతో బుట్టబొమ్మ ట్యాగ్ పూజాహెగ్డే ఇంటి పేరులా మారిపోయింది. తాజాగా బుట్టబొమ్మకి 2.ఓ లా దిగింది మౌనీరాయ్ అలియా నాగిని.
బుట్టబొమ్మ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది పూజాహెగ్డే. బుట్టబొమ్మ పాటతోనే కాదు...ఆ పాటలో వాడిన కాస్ట్యూమ్స్ తోనూ అమ్మడు ఎంతో హైలైట్ అయింది. బుట్టబొమ్మకి రూపం అంటూ ఉంటే? అది ఇలాగే ఉంటుందా? అన్న అందంగా సరితూగింది పూజాబ్యూటీ. దీంతో బుట్టబొమ్మ ట్యాగ్ పూజాహెగ్డే ఇంటి పేరులా మారిపోయింది. తాజాగా బుట్టబొమ్మకి 2.ఓ లా దిగింది మౌనీరాయ్ అలియా నాగిని.
పూజాహెగ్డే ముందు నుంచి బుట్టబొమ్మ బ్యూటీని హైలైట్ చేస్తే మౌనీరాయ్ మాత్రం తనలో బ్యాక్ బ్యూటీని హైలైట్ చేస్తూ కుర్రకారుకి కిర్రెక్కిస్తుంది. బ్రౌన్ కలర్ షోల్డెర్ లెస్ గౌనులో అమ్మడు వీపందాన్ని ఓ రేంజ్ లో హైలైట్ చేసింది. వీపందం నుంచి థై అందం వరకూ నాగిని హైలైట్ చేయడంలో ఎక్కడా తగ్గలేదు. తనదైన మార్క్ ఎలివేషన తో చూపరులను ఆకట్టుకుంటుంది. అమ్మడి పోలీకలు కూడా పూజాహెగ్డేకి సమీపంగానే ఉంటాయి.
పూజా బ్యూటీకి సిస్టర్ అన్నా? ఎలాంటి కన్ ప్యూజన్ లేకుండా నమ్మోచ్చు. ఇక కామెంట్ బాక్సులో పోస్టుల కైతే కొదవలేదు . నాగిని అందాన్ని పొగిడేస్తూ తమదైన శైలిలో పోస్టులు పెడుతున్నారు. ఇక కెరీర్ పరంగా తిరుగు లేకుండా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుం టుంది. మునుపటి కంటే మరింత వేగంగా పనిచేస్తోంది. గత ఏడాది ఖాళీగా ఉన్నా 2024 లో మాత్రం నాలుగైదు కమిట్ మెంట్లతో కనిపిస్తుంది.
ఆ మధ్య `బ్లాకౌట్` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే రిలీజ్ అయిన జాన్ అబ్రహం `వేద`లోనూ స్పెషల్ అప్పిరియన్స్ తో అలరించింది. ఆ సినిమా ప్లాప్ అయినా మౌనీ రాయ్ పెర్పార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న మరో రెండు చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.