స్టార్ కపూల్స్ అంబానీ ఇంట ఇలా!
అంబానీ ఇంట పెళ్లికి బాలీవుడ్ అంతా కదలింది. బాలీవుడ్ స్టార్ కపుల్స్ తో వేడుక మరింత రంగుమల యమైంది.
అంబానీ ఇంట పెళ్లికి బాలీవుడ్ అంతా కదలింది. బాలీవుడ్ స్టార్ కపుల్స్ తో వేడుక మరింత రంగుమల యమైంది. ఎవరి స్టైల్లో వారు డిజైనర్ దుస్తుల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. మూడు రోజుల పెళ్లి వేడుకలో భాగంగా తొలిరోజు అంతా సంప్రదాయ దుస్తులే ధరించాలి అన్న కండీషన్ ని అనుసరించి అంతా తూచ తప్పకుండా రూల్ తో ముందుకు సాగారు.
షారుక్ ఖాన్ గౌరీఖాన్ దంపతులు, సిద్దార్ధ్ మల్హోత్రా- కియారా జోడీ, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ జంట, యువజంట రణబీర్ కపూర్-అలియాభట్ జోడీలు తళుక్కున మెరిసాయి. కత్రినాకైఫ్ ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా ముస్తాబైంది. టాప్ టూ బాటమ్ ఒకే రంగు చీర..బ్లౌజ్ లో మెరిసింది. నెక్ పై అందమైన నక్లెస్..చెవులకు మ్యాచింగ్ పోగులు ధరించింది.
అలియాభట్ కూడా పింక్ సారీ..రవికలో మెరిసింది. నుదిటిన పాపిడి బొట్టు.. మెడలో అందమైన హారం ..చెవులకు పొడవైన రింగులు ధరించి ఎంతో అందంగా ముస్తాబైంది. వీళ్లిద్దరికీ భిన్నంగా కియారా, గౌరీఖాన్ హైలైట్ అయ్యారు. కియారా లెహంగా దుస్తుల్లో మెరవగా, పంజాబీ డిజైన్ లో గౌరీఖన్ తళుకులీనారు.
ఇక షారుక్, విక్కీ కౌశల్, రణబీర్ కపూర్, సిద్దార్ధ్ మల్హోత్రా డిఫరెంట్ కలర్స్ తో కూడిన శర్వాణీ దుస్తుల్లో మనోహారంగా ముస్తాబయ్యారు. డిజైనర్ ఎంపికల్లో ముగ్గురు ఎవరి ప్రత్యేకతని వారు చాటారు. నాలుగు జోడీలు కెమారాకు జంటగా ఫోటోలిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులు తమ అభిమాన జోడీలను ఉద్దేశించి ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు.