ఈ స్త్రీలో ఆ కొంటెతనం ఛమత్కారం ఏవీ?
శ్రద్ధా కపూర్ నటించిన `స్త్రీ` 2018లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే
శ్రద్ధా కపూర్ నటించిన `స్త్రీ` 2018లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ, కంటెంట్ తో పాటు పాత్రల తీరుతెన్నులు, మ్యూజిక్ కూడా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆ సినిమాలో టైటిల్ పాత్రలో నటించిన శ్రద్ధా కపూర్ నటనకు గొప్ప పేరు వచ్చింది. అందులో కొంటెతనం నిండిన ఛమత్కారమైన పాత్రలో శ్రద్ధా నటనకు గొప్ప ప్రశంసలు కురిసాయి. అదంతా అటుంచితే పార్ట్ 2 ఈ ఆగస్టులో విడుదలకు వస్తుండగా ప్రమోషనల్ మెటీరియల్ గురించి కొన్ని విమర్శలు వస్తున్నాయి.
`స్త్రీ` ఫ్రాంఛైజీలో ఇప్పుడు రెండో సినిమా పూర్తిగా కొత్త పంథా కథతో రూపొందుతోందని ఈ ప్రచార మెటీరియల్ చెబుతోంది. కానీ ఇది ప్రజలకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ఇటీవల విడుదలైన తమన్నా స్పెషల్ సాంగ్ బావుంది. అందులో తమన్నా మూవ్స్ బావున్నాయి. కానీ ఈ పాటను నోరా ఫతేహి పార్ట్ 1 సాంగ్ తో పోల్చి చూస్తున్నారు. అలాగే సీక్వెల్‌లో టైటిల్ పాత్రలో కొంటెతనం కానీ, ఛమత్కారం కానీ కనిపిస్తాయా లేదా? అన్న సందిగ్ధత అందరిలో నెలకొంది. శ్రద్ధా పాత్రను ఇప్పుడు పూర్తిగా కొత్త విధానంలో డిజైన్ చేయడం నిరాశను కలిగిస్తోంది. అయితే ప్రచార మెటీరియల్ కంటే భిన్నంగా థియేటర్లలో స్త్రీ2ని ఎలా చూపిస్తారో చూడాలని అంతా వేచి చూస్తున్నారు.
పార్ట్ 1లో నోరా ఫతేహి కమరాయి.. అభిమానులు ఎంతగానో ఇష్టపడిన మిలేగీ మిలేగి, ఆవో కభీ హవేలీ పే వంటి పాటల్లో ఉన్న పెప్ ఇప్పటి రెండో భాగం పాటల్లో మిస్సయిందని కూడా విమర్శలొస్తున్నాయి. సాహిత్యం, సంగీతం పరంగా స్త్రీ రేంజులో ఏదీ కుదరలేదని కూడా విశ్లేషిస్తున్నారు. ఈసారి స్త్రీ వినోదం స్థాయి తగ్గిందని కూడా కొందరు చెబుతున్నారు. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. పార్ట్ 3 ఉంటుందా లేదా? అన్నది రెండో భాగం విజయంపై ఆధారపడి ఉంది.