తాజ్ హోటల్ వెయిటర్ నేడు అగ్ర నటుడు!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో బోమన్ ఇరానీ తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ... చదువుపై ఆసక్తి ఉండేది కాదు.

Update: 2023-10-12 05:47 GMT

సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవ లేదు. జీరో నుండి హీరోల స్థాయికి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యి.. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ లుగా వెలుగు వెలుగుతున్నారు. చిన్నతనంలో తినేందుకు కనీసం తిండి లేక ఇబ్బంది పడ్డ వారు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీ లో వందలాది మంది కి డైరెక్ట్‌ గా లేదా ఇండైరెక్ట్‌ గా అన్నం పెడుతున్నారు.

హిందీతో పాటు సౌత్ లో పలు భాషల సినీ ప్రేమికులకు సుపరిచితుడు అయిన బోమన్‌ ఇరానీ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బోమన్ ఇరానీ తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ... చదువుపై ఆసక్తి ఉండేది కాదు. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత వెయిటర్ గా కోర్స్ చేశాను. కోర్స్ పూర్తి చేసిన తర్వాత తాజ్ హోటల్ లో రూమ్‌ సర్వీస్ బాయ్ గా, వెయిటర్ గా చేశాను.

వెయిటర్‌ గా చేస్తున్న సమయంలో తన తల్లి ప్రమాదానికి గురి కావడంతో ఆమె నిర్వహించే దుకాణం ను నేను నడిపించాను. 14 సంవత్సరాల పాటు అమ్మ దుకాణం ను నేనే నడిపించాను. ఆ సమయం లోనే నేను పెళ్లి చేసుకున్నాను. జీవితంలో ఏదో లోపిస్తుంది అనిపించేది. అందుకే ఫోటోగ్రాఫర్‌ గా కెరీర్ ను మొదలు పెట్టాను. ఫోటోగ్రాఫర్ గా చేస్తున్న సమయంలోనే యాడ్‌ ఫిల్మ్‌ లో నటించే అవకాశం వచ్చింది.

180 కి పైగా యాడ్స్ లో బోమన్ ఇరానీ కనిపించాడు. యాడ్స్ లో నటన చూసి మున్నా భాయ్ ఎంబీబీఎస్ లో నటించే అవకాశం వచ్చిందట. ఆ సినిమా కి గాను ఇరానీ రూ.2 లక్షల పారితోషికం అందుకున్నాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న బోమన్ ఇరానీ ఏ స్థాయి లో ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు పాన్‌ ఇండియా రేంజ్ లో దూసుకు పోతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.

తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం లో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో కీలక పాత్రలో బోమన్ ఇరానీ నటించి ఆకట్టుకున్నాడు. బెంగాల్‌ టైగర్‌, నా పేరు సూర్య మరియు అజ్ఞాతవాసి సినిమాల్లో కూడా ఈయన నటించి మెప్పించాడు. ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఈయన నటించి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాడట.

Tags:    

Similar News