బాక్సాఫీస్: అత్యధిక వేగంగా 1000 కోట్లు రాబట్టిన సినిమాలివే..

ఇకపై 1000 కోట్ల క్లబ్‌లో చేరే సినిమాల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే, టాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

Update: 2024-12-11 08:28 GMT

భారత సినిమా చరిత్రలో 1000 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించడం అనేది ఇప్పుడు ప్రతీ పాన్ ఇండియా మేకర్స్ కు మొదటి టార్గెట్. ఇక టాలీవుడ్ సినిమాలకు ఇది సాధ్యం అవుతుందని ఎవరు ఊహించలేదు. కొన్నేళ్ల క్రితం వరకు బాలీవుడ్ సినిమాలే బాక్సాఫీస్ ను ఎలాయి. ఇక బాహుబలి నుంచి సౌత్ సినిమాలు ఆ టార్గెట్ ను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక బాహుబలి 2 అనంతరం ఆర్ఆర్ఆర్, KGF 2 వంటి సినిమాలు ఈ మార్క్‌ను అధిగమించడమే కాదు, కొత్త రికార్డులను సృష్టించాయి.

అయితే ఇప్పుడు ఆ రికార్డులను కొత్త దశకు తీసుకెళ్లిన చిత్రం పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది. పుష్ప 2: ది రూల్ సునామీని ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు అంతర్జాతీయ బాక్సాఫీస్ కూడా ఎదుర్కొంటోంది.

కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్‌ను రాబట్టి ఇండియన్ సినిమాల్లోనే అత్యంత వేగంగా ఈ క్లబ్ లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, అల్లు అర్జున్‌ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక పాత రికార్డులను సైతం తుడిచిపెట్టింది. అంతకుముందు ఈ ఘనత బాహుబలి 2కి దక్కింది. బాహుబలి 2 సినిమా 10 రోజుల్లో 1000 కోట్ల మార్క్‌ను దాటింది.

ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు ఈ ఘనతను 16 రోజుల్లో అందుకున్నాయి. కాగా, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ 18 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరింది. ఆ తర్వాత పఠాన్ సినిమా 27 రోజుల్లో ఈ ఘనత సాధించి, అదే ఏడాది బాలీవుడ్‌ను రిప్రజెంట్ చేసింది. కానీ పుష్ప 2 ఈ లెక్కలన్నింటినీ కొత్త ఎత్తుకు చేర్చింది. పుష్ప 2 కోసం ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ రికార్డులను బ్రేక్ చేసే స్థాయిలో ఉంది.

సుకుమార్ తన డైరెక్షన్‌తో ఈ సినిమాను పాన్-ఇండియా హిట్‌గా మార్చాడు. ముఖ్యంగా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన, మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఈ చిత్రానికి పుష్ప 1 క్రేజ్ ఎంతగానో హెల్ప్ అయ్యింది. దీంతో హిందీలో బాక్సాఫీస్ లెక్కలు జెట్ స్పెస్ లో దూసుకుపోతున్నాయి.

ఇకపై 1000 కోట్ల క్లబ్‌లో చేరే సినిమాల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే, టాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పుష్ప 2 సాధించిన రికార్డు ఇతర దర్శకులకు, నటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న ఈ సినిమా ద్వారా తమ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ రికార్డ్ అందుకున్నారు. మొత్తానికి, పుష్ప 2 తన శక్తిని ప్రపంచానికి చాటింది. 1000 కోట్ల క్లబ్‌ను అత్యంత వేగంగా చేరిన ఈ చిత్రం, ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచింది. మరి టోటల్ గా ఈ నెంబర్ ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Tags:    

Similar News