బాక్సాఫీస్ 2024 - ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అన్ని భాషల నుంచి వేలసంఖ్యలో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అందుకొని భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాయి

Update: 2024-12-19 20:30 GMT

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అన్ని భాషల నుంచి వేలసంఖ్యలో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అందుకొని భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాయి. తెలుగు సినిమాలైన ‘పుష్ప 2’, ‘కల్కి 2898ఏడీ’ ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. వీటిలో అత్యధిక కలెక్షన్స్ చిత్రంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నిలిచింది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ లు అందుకున్న సినిమాలు ఉన్నట్లే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారిన మూవీస్ కూడా ఉన్నాయి.

కంగువా 150 కోట్ల దెబ్బ..

ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన సినిమాల జాబితాలో మొదటి స్థానంలో సూర్య ‘కంగువా’ ఉంటుంది. ఈ సినిమాని ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. వరల్డ్ వైడ్ గా 190 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. అయితే లాంగ్ రన్ లో కేవలం 63 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఓవరాల్ గా 150 కోట్ల మేరకు ఈ సినిమా ద్వారా నిర్మాతలకి నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచింది.

70కోట్లు పోగొట్టిన మార్టిన్

దీని తర్వాత కన్నడంలో ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కిన ‘మార్టిన్’ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే రిలీజ్ తర్వాత ఈ చిత్రం అస్సలు అంచనాలు అందుకోలేకపోయింది. లాంగ్ రన్ లో 22 కోట్ల మేరకు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. 70+ కోట్లపైన ఈ సినిమా ద్వారా మేకర్స్ కి నష్టం వచ్చింది. శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో ఇదే అతి పెద్ద డిజాస్టర్ మూవీగా మారింది.

ఇండియన్ 2 లాస్ ఎంత?

అలాగే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘ఇండియన్ 2’ కూడా ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. 250 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే రిలీజ్ సమయంలో ఈ మూవీపై పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ లేవు. లాంగ్ రన్ లో ఈ మూవీ 70-80 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఏకంగా 150 కోట్ల వరకు ఈ సినిమాతో మేకర్స్ కి నష్టం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్

ఇక ఇండియాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన ‘బడే మియాన్ చోటే మియాన్’ కూడా ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా మారింది. ఈ సినిమాని సుమారు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే లాంగ్ రన్ లో ఈ చిత్రం కేవలం 65-70 కోట్ల మధ్యలో షేర్ వసూళ్లు చేసింది. దీంతో 200 కోట్ల పైనే ఈ సినిమాకి నష్టం వచ్చిందని బిటౌన్ లో చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

దెబ్బకొట్టిన అజయ్ సినిమాలు

అజయ్ దేవగన్ ‘మైదాన్’ కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా లాంగ్ రన్ లో 65 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంట. దీంతో ఓవరాల్ గా 160 కోట్ల పైన ఈ సినిమాకి లాగ్ వచ్చిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలాగే అజయ్ దేవగన్ నటించిన మరో సినిమా ‘ఔరోన్ మే కహన్ దమ్ థా’ చిత్రం 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా థియేటర్స్ లో కేవలం 8 కోట్ల మేరకు మాత్రమే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో 90 కోట్ల పైన ఈ చిత్రానికి నష్టం వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

తెలుగులో బాక్సాఫీస్ షాక్

ఇక తెలుగులో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ షాక్ ను ఎదుర్కొంది. షాక్ సినిమా తరువాత మిరపకాయ్ సినిమాతో బిగ్ సక్సెస్ అందుకున్న హరీష్ రవితేజ చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో కలిశారు. ఇక 50 కోట్లతో నిర్మించగా సుమారు 40 కోట్ల మేరకు నష్టం వచ్చిందని సమాచారం. ఇలా ఈ ఏడాది అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన చిత్రాలుగా ఇవి నిలిచాయి.

Tags:    

Similar News