బాక్సాఫీస్.. శర్వా సడన్ ట్విస్ట్
జూన్ 7న మనమే మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి హడావిడి లేకుండానే ఇంత అకస్మాత్తుగా మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడంపై ఇండస్ట్రీలో చాలా రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
యంగ్ హీరో శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితం మూవీతో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాని తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాతో శర్వానంద్ సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. దేవదాస్, హీరో సినిమాలతో ఫ్లాప్ అందుకున్న శ్రీరామ్ ఆదిత్యకి కూడా మనమేతో సాలిడ్ సక్సెస్ కావాలి.
అలాగే యంగ్ బ్యూటీ సెన్సేషన్ కృతిశెట్టి కెరియర్ మళ్ళీ ట్రాక్ లో పడాలంటే మనమే సక్సెస్ తోనే సాధ్యం అవుతుంది. కంప్లీట్ ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో ఎంటర్టైన్మెంట్ కి ఎలాంటి డోకా ఉండదని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చూపించారు. ఇదిలా ఉంటే సడెన్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.
జూన్ 7న మనమే మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి హడావిడి లేకుండానే ఇంత అకస్మాత్తుగా మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడంపై ఇండస్ట్రీలో చాలా రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. బడా ప్రొడక్షన్ హౌస్ అయిన కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సోలోగా ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా అందుకోలేదు.
ఒక్కో సినిమాపై 30 కోట్లకి పైనే ఖర్చు చేస్తున్నారు. కానీ ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. వేరే ప్రొడక్షన్ హౌస్ లతో కలిసి చేసిన కార్తికేయ 2, ధమాకా మాత్రమే ఈ బ్యానర్ లో ఇప్పటి వరకు ఉన్న హిట్ సినిమాలు. అయితే మనమే మూవీతో సోలో హిట్ కొట్టాలని నిర్మాత విశ్వప్రసాద్ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 7 మాత్రమే ప్రస్తుతం చిన్న సినిమాలకి అందుబాటులో ఉన్న డేట్. జూన్ ఆఖరులో కల్కి రిలీజ్ అవుతోంది.
తరువాత భారతీయుడు 2, నెక్స్ట్ పుష్ప 3 మూవీస్ లైన్ గా ఉన్నాయి. వాటి మధ్యలో మనమే రిలీజ్ చేస్తే కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ముందుగానే గ్రహించి సడెన్ గా మనమే రిలీజ్ డేట్ ని ఖాయం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ లో అరడజనుకి పైగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో అడవి శేష్ గూఢచారి 2, ప్రభాస్, మారుతి పాన్ ఇండియా సినిమా, తేజా సజ్జా మిరాయ్ లాంటి చిత్రాలు ఉన్నాయి.