బోయ'మోసం.. ఊహించలేదు రామ!
బోయపాటి శ్రీను సినిమాలు అంటే ఎలా ఉంటాయో తెలిసిన విషయమే. లాజిక్ లెస్ సీన్లు, ఓవర్ ద టాప్ యాక్షన్ ఎపిసోడ్లతో నిండిపోతాయి.
బోయపాటి శ్రీను సినిమాలు అంటే ఎలా ఉంటాయో తెలిసిన విషయమే. లాజిక్ లెస్ సీన్లు, ఓవర్ ద టాప్ యాక్షన్ ఎపిసోడ్లతో నిండిపోతాయి. విలన్ హీరో ఫ్యామిలీని టచ్ చేయడం, ఆ తర్వాత హీరో విలన్లను నరకడం, ఈ క్రమంలో ఏడుపులు, పెడబొబ్బులు ఇలా అన్నీ బోయపాటి సినిమాలో కామన్. ఇవన్నీ బాలయ్యతో సెట్ అవుతాయి కానీ మిగతా హీరోలతో చేస్తే ట్రోల్ అవ్వాల్సిందే.
అయితే ఇప్పుడు స్కంద చిత్రం ఫుల్ ట్రోలింగ్‌కు గురౌతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అప్పుడే ఈ సమస్యను ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక మరీ దారుణంగా ఎదుర్కొంటోంది. ప్రతీ ఫ్రేమ్, ప్రతీ షాట్‌ను ఆడియెన్స్ డీ కోడ్ చేసి మరీ చూస్తున్నారు.
బోయపాటి తెరకెక్కించిన సీన్లు ఎంత తెలివితక్కువగా ఉన్నాయో చెబుతూ విమర్శిస్తున్నారు. పొలిటికల్ సైన్స్ క్లాసులో ఉండే అమ్మాయిలు సంబంధం లేని పుస్తకాలు పట్టుకుని కనిపించడం, ఓవైపు హీరో చేతిలో చనిపోతున్న వ్యక్తే.. మరోవైపు ఆ దృశ్యాన్ని చూస్తున్న వారిలో కూడా అదే వ్యక్తి కనిపించడం, అన్ని చాలా షాట్ల విషయంలో బోయపాటి దొరికేశారు.
ఇవన్నీ చాలవన్నటుగా బోయపాటి మరో సీన్లోనూ అడ్డంగా దొరికేశారు. క్లైమాక్స్ ఫైట్‌లో హీరో రామ్ దీప స్తంభాలు పట్టుకుని విలన్లపై ఎటాక్ చేస్తూ విరుచుకుపడతారు. ఆ షాట్ ఫ్లోలో చూసుకుంటూ వెళ్లిపోతే ఏం తేడా కనపడదు కానీ.. ఓటీటీలో చూసే కొంతమంది ఆడియెన్స్ స్లోమోషన్లో ఆ షాట్‌ను జాగ్రత్తగా గమనించి ఓ తప్పును కనిపెట్టేశారు. ఒక చోట రామ్ స్థానంలో బోయపాటి ఉన్న విషయాన్ని కనిపెట్టేశారు. అచ్చం రామ్ లాగే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని బోయపాటే యాక్ట్ చేశారు.
మరి ఊరికే ముచ్చట తీర్చుకోవడానికి బోయపాటి అలా చేశారా.. ఆ సమయానికి రామ్ అందుబాటులో లేకా అలా చేయారో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం తెగ ఆడేసుకుంటున్నారు. స్కందలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయని, ఇలాంటి సినిమాను ఎలా తీశావ్ అయ్యా అంటూ తెగ ట్రోలింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాకు సీక్వెల్ ఎందుకయ్యా అని ప్రశ్నిస్తున్నారు.