`బ్ర‌హ్మానందం` అండ్ కో క‌డుపుబ్బా న‌వ్వించేలా!

తాత‌-మ‌న‌వ‌ళ్లుగా తండ్రీకొడుకులు హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం-గౌత‌మ్ క‌లిసి `బ్ర‌హ్మానందం` అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-19 08:13 GMT

తాత‌-మ‌న‌వ‌ళ్లుగా తండ్రీకొడుకులు హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం-గౌత‌మ్ క‌లిసి `బ్ర‌హ్మానందం` అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ లోనే ఆనందం క‌లిగిస్తున్నారు. సాధార‌ణంగా బ్ర‌హ్మానందాన్ని బ‌య‌ట చూస్తేనే జ‌నాలు న‌వ్వుతారు. ఆయ‌న ఫేస్ లో ఏముందో తెలియ‌దు కానీ....సినిమాలో కనిపించినా..బ‌య‌ట క నిపించినా ప్రేక్ష‌కులు న‌వ్వుతార‌ని బ్ర‌హ్మానంద‌మే స్వ‌యంగా ఓ సంద‌ర్భంలో రివీల్ చేసారు.


ఇప్పుడు ఏకంగా ఆయ‌న పేరు టైటిల్ తోనే సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈసినిమా క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని తేలిపోయింది. అందుకు త‌గ్గ‌ట్టే ఇప్ప‌టికే రిలీజ్ అయిన బ్ర‌హ్మానందం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. పోస్ట‌ర్ లో బ్ర‌హ్మీ ఎంతో ట్రెడిష‌న‌ల్ గా పంచెక‌ట్టులో క‌నిపించారు. సంక్రాంతి అల్లుడులా జెరీ అంచు సిల్కు చొక్కా తొడుక్కుని షేడ్స్ ధ‌రించి ఎంతో స్టైలిష్ గా క‌నిపించారు.

తెల్ల పంచె గోల్డ్ చొక్కా అద్భుతంగా కుదిరాయి. దీంతో గ్లింప్స్ పై ఆస‌క్తి మొద‌లైంది. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే గ్లింప్స్ రిలీజ్ చేసారు. సినిమాలో పాత్ర‌ల‌న్నీ ఆద్యంతం న‌వ్వించే రోల్స్ అని తెలుస్తోంది. వెన్నెల కిషోర్- గౌత‌మ్ పాత్ర‌లు, సంభాష‌ణ‌లు న‌వ్వు పుట్టిస్తున్నాయి. గౌత‌మ్ చెబుతోన్న వ‌డ్డీ లెక్క‌ల డైలాగుల‌న్నీ న‌వ్వులు పువ్వులే. ఫైన‌ల్ గా బ్ర‌హ్మానందం ఇంట్లోకి ఎంట‌ర్ అవ్వ‌డంతో అస‌లైన కామెడీ షురూ చేసిన‌ట్లు అయింది.

ప్ర‌స్తుతం ఈ వీడియో గ్లింప్స్ నెట్టింట వైర‌ల్ గా మారింది. చాలా కాలం త‌ర్వాత బ్ర‌హ్మానందం త‌న పాత్ర చుట్టూ తిరిగే ఓ సినిమా చేయడం విశేషం. అలాగే గౌత‌మ్ కి మంచి కంబ్యాక్ మూవీ అవుతుంద‌ని అంతా ఆశిస్తున్నారు. ఆర్‌విఎస్ నిఖిల్ దర్శకత్వంలో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్ కథానాయికలు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Full View
Tags:    

Similar News