ప్ర‌భాస్-బ్ర‌హ్మానందం మ‌ళ్లీ పండిస్తారా?

ఆ రెండు చిత్రాల్లోనూ ద‌ర్శ‌కులు బ్ర‌హ్మానందం పాత్ర‌ని చ‌క్క‌గా డిజైన్ చేయ‌డంతోనే సాధ్య‌మైంది. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌భాస్ కామెడీ టైమింగ్ కూడా బాగా క‌లిసొచ్చింది.

Update: 2024-02-04 16:30 GMT

ప్ర‌భాస్-బ్ర‌హ్మానందం మ‌ధ్య కామెడీ ట్రాక్ ఏరేంజ్ లో పండుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్లాప్ అయిన 'రెబ‌ల్' లో సైతం వాళ్లిద్ద‌రి మ‌ధ్య కామెడీ బాగా పండింది. అటుపై 'మిర్చి'లోనూ ఆ కాంబినేష‌న్ బాగా వ‌ర్కౌట్ అయింది. ఆ రెండు చిత్రాల్లోనూ ద‌ర్శ‌కులు బ్ర‌హ్మానందం పాత్ర‌ని చ‌క్క‌గా డిజైన్ చేయ‌డంతోనే సాధ్య‌మైంది. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌భాస్ కామెడీ టైమింగ్ కూడా బాగా క‌లిసొచ్చింది.

సైలెంట్ గా ఎలాంటి ఎక్స్ ప్రెష‌న్ లేకుండా బ్ర‌హ్మానందంతో కామెడీ పండించ‌డం డార్లింగ్ కే చెల్లింది. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ కాంబినేష‌న్ లో సినిమా రాలేదు. ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోవ‌డంతో కామెడీకి పూర్తిగా దూర‌మ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో హార‌ర్ కం కామెడీ థ్రిల్ల‌ర్ రాజాసాబ్ చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ప్ర‌భాస్ పిలిచి మారుతికి ఛాన్స్ ఇచ్చాడు. త‌న‌లో కామెడీ సెన్స్ న‌చ్చి ఛాన్స్ ఇచ్చిన చిత్రం ఇది.

ఈ నేప‌థ్యంలో కామెడీకి పెద్ద పీట వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో బ్ర‌హ్మానందాన్ని కూడా తీసుకున్నార‌ని స‌మాచారం. ముఖ్యమైన పాత్ర కోసం బ్ర‌హ్మంన‌దంకి ఎంపిక చేసారుట‌. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రిలీజ్ చేయ‌డానికి యూనిట్ రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ఇదే నిజ‌మైతే మిర్చి త‌ర్వాత ఈ కాంబినేష‌న్ లో మంచి కామెడీని ఎక్స్ పెక్ట్ చేయోచ్చు. ఇప్ప‌టికే డార్లింగ్ లుంగీ లుక్ చూస్తేనే న‌వ్వు తెప్పిస్తుంది.

అత‌డిలో కామెడీ టింజ్ ని మ‌రోసారి మారుతి త‌ట్టిలేపుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇందులో మాళవిక మోహనన్ నభా నటేష్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాన్ని నిర్మిస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.



Tags:    

Similar News