చరణ్ కోసం R.D.X ని దించుతున్నారా..?

ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో రాం చరణ్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

Update: 2024-03-22 15:09 GMT

పాన్ ఇండియా సినిమాలతో కళకళలాడుతున్న టాలీవుడ్ లో మన స్టార్ అంతా కూడా నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నారు. RRR తో గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఈ ఇద్దరు కూడా తమ తర్వాత సినిమాలతో చాలా పెద్ద ప్లాన్ వేశారు. ఆల్రెడీ ఎన్.టి.ఆర్ దేవర సినిమా చేస్తుండగా రాం చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో రాం చరణ్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు.

రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. అయితే ఈ సినిమా కాస్టింగ్ గురించి మెగా ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది. సినిమాలో ఆల్రెడీ జాన్వి కపూర్ హీరోయిన్ గా లాక్ చేయగా సినిమాలో ఆమె నటించడం హెల్ప్ అవుతుంది. ఇక ఈ సినిమాలో మలయాళ యువ సంచలనం ఆంటోని వర్గీస్ కూడా ఛాన్స్ అందుకున్నాడని టాక్. మలయాళంలో గత ఆరేళ్లుగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆంటోని లాస్ట్ ఇయర్ చేసిన R.D.X సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.

R.D.X సినిమా ఏమో కానీ అందులో సాంగ్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు ఆంటోని. ఆ క్రేజ్ తో ఇప్పుడు తెలుగు ఆఫర్ అందుకున్నాడు. రాం చరణ్ బుచ్చి బాబు సినిమాలో ఆంటోని వర్గీస్ ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కి అతన్ని అడిగినట్టు టాక్. అతను ప్లేస్ అవ్వడంతో RC16 పై మలయాళంలో ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. ప్రస్తుతం మలయాళంలో 3 సినిమాలు చేస్తున్న ఆంటోని వర్గీస్ చరణ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పొచ్చు.

ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. బుచ్చి బాబు కథ చెప్పగానే సర్ ప్రైజ్ అయ్యానని అన్నారు. శివ రాజ్ కుమార్ రాకతో కూడా RC16 సినిమా మరింత క్రేజీగా మారుతుంది. శంకర్ తో గేమ్ చేంజర్ గా పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని చూస్తున్న రాం చరణ్ బుచ్చి బాబు సినిమాతో మరో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

Tags:    

Similar News