అన్నయ్య పెళ్లిలో చెల్లి చీరందంలో!
వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని రకాల అనుభవాల నేపథ్యంలో మరింత బలంగా మారాలని సీరియస్ గానే ఉన్నారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్లీ టాలీవుడ్ లో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. కంబ్యాక్ ని ఇంకా సీరియస్ గా ప్రారంభించలేదుగానీ..ప్రణాళిక అలాగే కనిపిస్తుంది. మునుపటిలా కాకుండా ఈసారి తనదైన బ్రాండ్ వేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని రకాల అనుభవాల నేపథ్యంలో మరింత బలంగా మారాలని సీరియస్ గానే ఉన్నారు.
ఇప్పటికే వెబ్ సిరీస్ లతో జర్నీ సాగిస్తోన్న నిహారిక సినిమాల్లోనూ బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు అక్క సుస్మిత కొణిదెల కూడా డైరెక్టర్ అవుతున్నారు? అనే ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో చెల్లెలు కూడా క్రియేటివ్ గా ఎందుకు వెళ్ల కూడదు అన్న ఆలోచన సైతం నిహారికకు తట్టినట్లు గుస గుస వినిపిస్తుంది. మరి ప్రిన్సెస్ ని సెకెండ్ ఇన్నింగ్స్ ని ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు? అన్నది తెలియాలి.
ఇక సోషల్ మీడియాలో నిహారిక యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అవసరాన్ని డిజైనర్ దుస్తుల్లో... ట్రెడీషనల్ దుస్తుల్లో కనిపిస్తుంటారు. తాజాగా నిహారిక చీరలో ఒదిగిపోయిన బ్యూటీని మరోసారి పరిచయం చేసారు. ఇదిగో ఇక్కడిలా క్రీమ్ కలర్ సారీ..మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి అందమంతా నాకే సొంతం అనిపిస్తున్నారు. నిహారిక అలకంరణ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
నడుముకి వడ్డానం.. నుదిటిన పాపిడి బొట్టు.. మెడలో డిజైనర్ గొలుసు.. చెవులీలు ప్రతీది నిహారికని అందంగా తీర్చిదిద్దాయి. ఇక చేతికి వేసుకున్న మ్యాచింగ్ గాజులు మరింత బ్యూటీని తీసుకొచ్చాయి.ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. మరి ఈ ఫోటో నిహారిక ఎప్పుడు దిగారు? అంటే అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లిలో అని రివీల్ చేసారు. వరుణ్ పెళ్లి మధ్యలో ఫోటో గ్రాఫర్ ఖాళీగా రిలాక్స్ అవుతుంటే? అతన్ని పక్కకు తీసుకొచ్చి ఇలా తనకి నచ్చిన భంగిమలో ఫోజులిచ్చినట్లు తెలిపారు.