బుచ్చిబాబు ఆలోచలన్నీ వెరీ రిచ్!
అదే గురువుకి రామ్ చరణ్ తో సినిమా తీయడానికి కొన్నేళ్లు పట్టింది. కానీ శిష్యుడు మాత్రం రెండవ సినిమాకే చరణ్ డేట్లు సంపాదించాడు
#ఆర్సీ 16కి ఛాన్స్ అందుకుని బుచ్చిబాబు అందర్నీ సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత ఏకంగా రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం ఒడిసిపట్టుకున్నాడు. బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు అన్న సంగతి తెలిసిందే. అదే గురువుకి రామ్ చరణ్ తో సినిమా తీయడానికి కొన్నేళ్లు పట్టింది. కానీ శిష్యుడు మాత్రం రెండవ సినిమాకే చరణ్ డేట్లు సంపాదించాడు.
మరి ఇది ఎలా సాధ్యమైంది? అంటే అది బుచ్చిబాబు రిచ్ థాట్స్ తోనే సాధ్యమైన తెలుస్తోంది. నిన్నటి రోజును సుకుమార్ సైతం ఇదే విషయాన్ని రివీల్ చేసాడు. బుచ్చిబాబు అంతా చాలా పెద్ద పెద్ద ఆలోచనలు కలిగి ఉంటాడని అన్నారు. అన్నట్లే తన కలని శిష్యుడు సాధ్యం చేసుకున్నాడు. పెద్ద పెద్ద కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. అందుకు తగ్గ పని చేయండని అబ్దుల్ కలాం చెప్పినట్లు బుచ్చిబాబు చేసినట్లే కనిపిస్తుంది.
తన ఆలోచనా విధానంతోనే చరణ్ తో ఇంత వేగంగా ఛాన్స్ అందుకోగలిగాడు. అందుకు బ్యాకెండ్ లో సుకుమార్ సహకారం చేసినప్పటికీ ప్రతిభ లేకపోతే చరణ్ అవకాశం కల్పించేవాడు కాదు. బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చడంతోనే ప్రాజెక్ట్ ఒకే అయింది. ఆ విషయంలో బుచ్చిబాబు ప్రశంసించాల్సిందే. పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నారు. మరెంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్లలో చాలా మంది కూడా చరణ్ కి స్టోరీలు చెప్పి ఉండొచ్చు.
కానీ చరణ్ కి బుచ్చిబాబు కనెక్ట్ అయినట్లు ఇంకెవ్వరు కనెక్ట్ కాలేదు. చరణ్ కంటే ముందు బుచ్చిబాబు ఎన్టీఆర్ కి ఓ స్టోరీ చెప్పాడు. కానీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. అంటే బుచ్చిబాబు ఇండస్ట్రీకి రాక ముందే బిగ్ స్టార్స్ ని టార్గెట్ గా పెట్టుకుని వచ్చాడని తెలుస్తోంది. మెగా మేనల్లుడితో వచ్చిన అవకాశాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకుని ఇప్పుడు తనలో సిసలైన ప్రతిభని బయటకు తీసి ముందుకెళ్తున్నాడు. ఆర్సీ 16 కూడా సక్సెస్ అయితే బుచ్చిబాబు గురువును మించిన శిష్యుడే.