అర్థరాత్రి పుష్ప 2 సక్సెస్ వేడుకలో బన్నీ,సుక్క!
ఆ హిట్‌ను బన్నీ, సుక్కులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
అల్లు అర్జున్, సుకుమార్‌ల పుష్ప 2 సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. నార్త్ ఇండియాలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సొంతం చేసుకోవడంతో పాటు, వరల్డ్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న సినిమాగా పుష్ప 2 నిలిచింది. మొదటి రోజు దాదాపుగా రూ.300 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం అందుతోంది. అంతే కాకుండా నార్త్ ఇండియాలో ఇప్పటి వరకు షారుఖ్ పేరు మీద ఉన్న అత్యధిక మొదటి రోజు వసూళ్లను పుష్పరాజ్ కొట్టి పడేశాడు. మొత్తానికి మూడు సంవత్సరాల కష్టంకు తగ్గ ఫలితంను బన్నీ, సుకుమార్ సొంతం చేసుకున్నారు.
పుష్ప 2 సినిమా కోసం గత కొన్ని నెలలుగా కనీసం కంటికి నిండా నిద్ర లేకుండా కష్టపడుతున్న దర్శకుడు సుకుమార్, మునుపెన్నడూ లేని విధంగా కష్టపడ్డ అల్లు అర్జున్‌లు హిట్‌తో సంతోషం వ్యక్తం చేశారు. ఈ హిట్ వారికి ఎంతగా వారికి సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక మామూలు హిట్ కొడితేనే ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్న రోజులు ఇవి. అలాంటిది ఇండస్ట్రీ హిట్, పాన్ ఇండియా హిట్, ఆల్ టైమ్ రికార్డ్ ఇలా ఏది ఉంటే అది అన్నీ ఈ సినిమాకు హిట్ రూపంలో దక్కింది. ఆ హిట్‌ను బన్నీ, సుక్కులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
సినిమాకి హిట్ టాక్ రావడంతో అల్లు అర్జున్, సుకుమార్‌లు సంతోషంతో పార్టీ చేసుకున్నారు. పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చడంతో పాటు, కేక్ కట్ చేసి అర్థరాత్రి సమయంలో పార్టీ చేసుకున్నారు. డిసెంబర్ 5వ తారీకు అదర్థరాత్రి సమయంలో కేక్ కట్ చేసి దేశ వ్యాప్తంగా పుష్పకు వస్తున్న స్పందనకు సంతోషంను పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్, సుకుమార్‌ల యొక్క కేక్ కట్టింగ్ వీడియో, వారి యొక్క సెలబ్రేషన్ వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 కోసం వారిద్దరు ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. హిట్‌తో ఆ కష్టం మొత్తం పోయినట్లుగా వారు చాలా రిలాక్స్‌గా కనిపిస్తున్నారు.
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీవల్లి పాత్రలో పుష్ప తో కలిసి రష్మిక నటించిన తీరుకు ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో రష్మిక నేషనల్ అవార్డ్ స్థాయిలో నటించింది అంటున్నారు. జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డు రాకుంటే దర్నాలు సైతం చేస్తాం అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలోనూ పుష్ప 2 కి పాజిటివ్‌గానే స్పందన వచ్చింది. నార్త్ ఇండియాలో రాబోయే రెండు మూడు రోజుల వసూళ్లు ఎలా ఉంటాయి అనేది అందరికీ ఆసక్తిగా ఉంది.