ప్రభాస్ - బన్నీ.. బయ్యర్లు భయపడుతున్నారా?

ఈ కారణంగానే కల్కి2898ఏడీ, పుష్ప 2 సినిమాల రైట్స్ కొనడానికి బయ్యర్లు ముందుకి రావడం లేదనే మాట వినిపిస్తోంది.

Update: 2024-03-12 04:18 GMT

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు అంటే కల్కి 2898 ఏడీ, పుష్ప 2 అని చెప్పాలి. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 500 కోట్లకి పైగా బడ్జెట్ తో కల్కి సినిమాని తెరకెక్కిస్తున్నారు. మే నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

కానీ ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు మాత్రం ముందుకి రావడం లేదంట. దీనికి కారణం నిర్మాత అశ్వినీదత్ చెబుతున్న ధరలే. ఏరియా వారీగా ఈ మూవీ హక్కుల కోసం నిర్మాత భారీగా డిమాండ్ చేస్తున్నారంట. ఓవర్సీస్ హక్కుల కోసం 100 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నైజాం రైట్స్ కోసం 80 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంట.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఈ స్థాయిలో కోట్ చేసిన కూడా బయ్యర్లు కొనడానికి ముందుకొచ్చారంటే దానికి కారణం బాహుబలి సక్సెస్. అయితే నాగ్ అశ్విన్ చివరిగా మహానటి మూవీ చేశారు. చాలా గ్యాప్ తర్వాత కల్కి 2898ఏడీ మూవీ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఇమేజ్ పరంగా చూసుకున్న అంత పెట్టడం అంటే రిస్క్ అవుతుందని భావిస్తున్నారు. సలార్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బయ్యర్లకి పెద్దగా లాభాలు రాలేదు.

అలాగే పుష్ప 2 సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం కూడా మైత్రీ నిర్మాతలు వంద కోట్లు డిమాండ్ చేస్తున్నారంట. తెలుగు రాష్ట్రాలలో కూడా రైట్స్ కోసం భారీగానే కోట్ చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి పుష్ప మూవీ తెలుగు రాష్ట్రాలలో ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేదు. అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకుంది. నార్త్, కోలీవుడ్, మలయాళీ ఇండస్ట్రీలలో హిట్ టాక్ తెచ్చుకుంది.

పుష్ప 2 మీద విపరీతమైన క్రేజ్ ఉండటంతో నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారంట. ఈ కారణంగానే కల్కి2898ఏడీ, పుష్ప 2 సినిమాల రైట్స్ కొనడానికి బయ్యర్లు ముందుకి రావడం లేదనే మాట వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలకి సంబంధించి టీజర్, ట్రైలర్స్ లాంటివి విడుదల చేసి హైప్ క్రియేట్ చేయగలిగితే పబ్లిక్ ఇంటరెస్ట్ బట్టి డిస్టిబ్యూటర్స్ కాస్తా డేర్ చేసే ఛాన్స్ ఉండొచ్చు.

బజ్ విషయంలో కల్కి అయితే చాలా వెనుకబడి ఉంది. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పుష్ప 2 రిలీజ్ పై కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి రెగ్యులర్ ప్రమోషన్స్ కు ఇంకా టైమ్ ఉంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా 1000 కోట్ల బిజినెస్ మార్క్ ను టచ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా నార్త్ లోనే బన్నీ ఈసారి ఎక్కువగా ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. మరి అంచనాలకు తగ్గట్టుగా సినిమా మార్కెట్ లో మంచి ధరలకు అమ్ముడవుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News