కెప్టెన్ మిల్లర్ ట్రైలర్.. బ్రిటీషర్లకి ఎదురెల్లిన కామ్రేడ్ కథ!
కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు.
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కెప్టెన్ మిల్లర్' సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన కోలీవుడ్ రిలీజ్ అయింది. ఈసినిమాను తమిళ్ తో పాటే తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో కేవలం తమిళ్ లోనే రిలీజ్ చేశారు. అక్కడ ఈసినిమాకు అక్కడ మంచి ప్రశంసలు దక్కాయి. సినిమాలో ధనుష్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. కేవలం నాలుగు రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈసినిమాను తెలుగులో జనవరి 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం 'కెప్టెన్ మిల్లర్' తెలుగు ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ట్రైలర్లో ధనుష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు.
ఇక ట్రైలర్ ని పరిశీలిస్తే.. 'తెల్లదొరకి దొంగవి' అని బ్యాగ్రౌండ్ లో వచ్చే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. 'నీలాగా నేను కూడా ఓ హంతకురాలిని అయి ఉంటే వాడ్ని నేనే చంపేదాన్ని. నాకోసం వాడు చావాలి" అని బ్యాగ్రౌండ్ లో డైలాగ్ వస్తుండగా ప్రియాంక మోహన్ చేతిలో గన్ పట్టుకుని కనిపించింది. 'చెడ్డ వాళ్ళని చంపావు. మంచోడివి అయి ఉంటావు' అనే డైలాగ్ తో సందీప్ కిషన్ ఎంట్రీ చూపించారు.
'నువ్వు ఎవరు, నీకేం కావాలనే దాన్నిబట్టి నేను ఎవరో తెలుస్తుంది..' అనే డైలాగు వినిపిస్తూ ఉండగా ధనుష్ డిఫరెంట్ గెటప్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లతో ధనుష్ ఫైట్ చేసే షాట్స్ ని చూపించారు. బ్రిటిషర్లు అమాయకులైన ప్రజల్ని చిత్ర హింసలు పెట్టడం, వాళ్లకు వ్యతిరేకంగా ధనుష్ తో పాటు ఊరిలో ఉన్న కొందరు ఓ దళం లాగా ఏర్పడి పోరాడడం వంటి సన్నివేశాలను ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు."యు బిలీవ్ ద డెవిల్. ఐయామ్ ద డెవిల్.. అండ్ యు విల్ కాల్ మీ" అంటూ ధనుష్ డైలాగ్ చెబుతూ గన్ లోడ్ చేస్తున్న షాట్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది.
ఆ తర్వాత ధనుష్ ఆర్మీ డ్రెస్ వేసుకుంటూ 'కెప్టెన్ మిల్లర్' అని చెప్పే డైలాగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. ట్రైలర్లో ధనుష్ సుమారు మూడు నుంచి నాలుగు డిఫరెంట్ లుక్స్ లో దర్శనమిచ్చాడు." ఆకలి మీద ఉన్న సింహానికి ఒక ఎద దొరికింది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేయాలని ఒక గాడిదప్పుడు గుంపు కాచుకుని ఉంది. అప్పుడు ఆ ఎరని కోడేలు లాక్కెళ్లితే ఏమవుతుంది?' అంటూ బ్యాగ్రౌండ్ లో వచ్చే డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది. మరి తెలుగులో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.