డబుల్ ఇస్మార్ట్ ని చెక్కుతున్నాడా?
అయితే ఈ కారణంగా పరాజయాలు కూడా ఎక్కువవు తున్నాయనే విమర్శ కూడా ఉంది.
ఒకప్పుడు పూరి సినిమా ఇంటే ఇలా సెట్స్కి వెళ్లి షూటింగ్ సహా అన్ని పనులు పూర్తిచేసుకుని అలా రిలీజ్ అయ్యేది. టాలీవుడ్ లోనే అత్యంత వేగంగా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసే ఏకైక దర్శకుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఈ కారణంగా పరాజయాలు కూడా ఎక్కువవు తున్నాయనే విమర్శ కూడా ఉంది. పూరి ఎక్కువ సమయం తీసుకుని తొందరపడకుండా సినిమా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిమానులు సహా ఆయన సతీమణి కూడా అభ్యర్ధించారు.
ఇలా వాళ్ల అభ్యర్ధన మేరకు..సక్సెస్ కోసం పూరి ఇప్పుడు రూట్ మార్చారు. అందుకే `ఇస్మార్ట్ శంకర్` కి సీక్వెల్ గా తెరకెక్కిస్తోన్న `డబుల్ ఇస్మార్ట్ శంకర్` ని ఇంత ఆలస్యం చేస్తున్నారన్నది వాస్తవం. లేదంటే పూరి శైలిలో చుట్టేసి రిలీజ్ చేయమంటే రామ్ ఎప్పుడో మార్కెట్ లోకి వచ్చేసాడు. కొన్ని నెలలుగా ఈ సినిమా పనుల్లో టీమ్ అంతా నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో పూరి సహా అంతా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
పూరి సొంత నిర్మాణం లోనూ రూపోందుతున్న సినిమా. ఎలాగైనా హిట్ అందుకుని అన్ని లెక్కలు సరి చేయాల్సిన సినిమా కూడా ఇదే . దీంతో పూరి కాన్సంట్రేషన్ అంతా ఈ సినిమాపైనే పెట్టి పనిచే స్తున్నాడు. అటు రామ్ కూడా రేసులో బాగా వెనుకబడ్డాడు. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత సరైన సక్సెస్ కూడా పడలేదు. దీంతో ఆయన కూడా కూల్ గానే చేద్దామనే భరోసా ఇవ్వడంతో పూరి అంతే కూల్ గా పూర్తి చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే సినిమాని సెట్స్ లో చెక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఒకటికి రెండుసార్లు తానేం తీసారో చెక్ చేసుకుని ది బెస్ట్ అనుకున్న ఔట్ ఫుట్ నే తీసుకుని ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇలా టైమ్ తీసుకుని సినిమా చేయడం ఎంతో ఉత్తమమైనది. ఇప్పుడున్న పోటీలో నెట్టుకురావాలంటే? హీరోని కొత్తగానూ చూపించాలి. మరి రామ్ పాత్రని పూరి డబుల్ ఇస్మార్ట్ లో ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలి.