ఆస్కార్ ఉత్తమ నటుడిపై లైంగిక వేధింపుల కేసు
ఎనిమిదేళ్ల క్రితం న్యూయార్క్ రూఫ్‌టాప్ రెస్టారెంట్‌లో జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఆస్కార్ ఉత్తమ నటుడు జేమీ ఫాక్స్ పేరు ప్రముఖంగా వినిపించింది.
అతడు ఆస్కార్ రేంజ్ నటుడు. ఉత్తమ నటుడిగా అకాడెమీ పురస్కారం అందుకున్నాడు. కానీ పెడ బుద్ధి సమస్యల్లోకి నెట్టింది. సంఘంలో అతడి గౌరవానికి భంగం తెచ్చింది. ఉత్తమ నటుడైన అతడిని దిగజార్చిన ఘటన ఒంటరి మహిళపై వేధింపులకు పాల్పడడం. అతడు ఒక బార్ లో తాగిన మైకంలో ఏకంగా మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో చాలా కాలంగా అతడు కోర్టు విచారణను ఎదుర్కొంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎనిమిదేళ్ల క్రితం న్యూయార్క్ రూఫ్‌టాప్ రెస్టారెంట్‌లో జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఆస్కార్ ఉత్తమ నటుడు జేమీ ఫాక్స్ పేరు ప్రముఖంగా వినిపించింది. పాపులర్ హాలీవుడ్ పత్రిక TMZ నివేదిక ప్రకారం, ఒక మహిళ అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆగస్టు 2015లో న్యూయార్క్‌లోని రూఫ్‌టాప్ రెస్టారెంట్ క్యాచ్‌లో ఫాక్స్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ ఆరోపించింది
ఫాక్స్ తనను బలవంతంగా తాకడానికి ప్రయత్నించాడని ఆ మహిళ ఆరోపించింది. రూఫ్ టాప్ బార్ వద్ద ఆమె రొమ్ములు జననాంగాలను అతడు బలవంతంగా తాకాడు. జేన్ డో అనే మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంలో క్యాచ్ హాస్పిటాలిటీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు మార్క్ బిర్న్‌బామ్‌ను రెస్టారెంట్ సిబ్బంది ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆ మహిళ గొంతు నొప్పికి వైద్యం చేయించుకోవాల్సి వచ్చిందని దావాలో పేర్కొంది. ఇది నొప్పి బాధ, మానసిక క్షోభ, ఆందోళన, అవమానానికి పరిహారం చెల్లించాలని కూడా కోరుతూ వ్యాజ్యంలో పేర్కొంది.
MeToo ఉద్యమం సమయంలో జామీ ఫాక్స్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు.అయితే విచారణలో అతడు ఆ ఆరోపణలను ఖండించాడు. అడల్ట్ సర్వైవర్స్ యాక్ట్, పరిమితుల చట్టాల పరిధిలో కోర్టులో అటువంటి వ్యాజ్యాలను దాఖలు చేయడానికి అనుమతించే న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం అతడు నిందితల జాబితాలో ఉన్నాడు. ఇటీవల దాఖలైన వ్యాజ్యాల వరుసలో లైంగిక తప్పుకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాజా ప్రముఖులలో అతను ఒకడిగా ఉన్నాడు.
అమెరికన్ నటుడు, గాయకుడు, పాటల రచయిత, రికార్డ్ నిర్మాత, హాస్యనటుడుగా జామీ ఫాక్స్ గొప్ప స్థానంలో ఉన్నాడు. కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. అకాడమీ అవార్డు గ్రహీత మహిళపై దాడి చేసే సమయంలో మత్తులో ఉన్నాడు. ఆమెను మరింత ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. జేమీ ఫాక్స్ ఇటీవల ప్రైమ్ వీడియోలో విడుదలైన కోర్ట్‌రూమ్ డ్రామా ది బరియల్‌లో కనిపించాడు. 77వ ఆకాడెమీ అవార్డుల్లో రే అనే చిత్రంలో నటనకు గాను జేమీ ఫాక్స్ కి ఉత్తమ నటుడిగా ఆస్కార్ దక్కింది. ఇదే చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ నటుడిగాను పురస్కారం అందుకున్నాడు.