పొట్టి గౌనులో క్యాథరిన్ పాప.. బ్యూటీఫుల్ లుక్

ఈ పిక్ లో ఆమె బ్లాక్ డ్రెస్ లో స్మార్ట్ గా కనిపిస్తూ, ఆమె స్టైలిష్ అవతారంలో ఆకర్షణీయంగా నిలిచింది.

Update: 2024-09-10 16:03 GMT

క్యాథరిన్ ట్రెసా తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ తెలుగు తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు పొందిన నటి. ఇక ఆమె తన పుట్టినరోజు సందర్బంగా, డల్లాస్ టెక్సాస్ లో స్పెషల్ గా పార్టీ వైబ్ లో మునిగి తేలింది. ఆమె చాలా ఆనందంగా ఉందని ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఈ పిక్ లో ఆమె బ్లాక్ డ్రెస్ లో స్మార్ట్ గా కనిపిస్తూ, ఆమె స్టైలిష్ అవతారంలో ఆకర్షణీయంగా నిలిచింది.


ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “మరో ఏడాది సూర్యుడిని చుట్టి వచ్చింది. దృశ్యం అద్భుతంగా ఉంది” అని కామెంట్ చేసిన క్యాథరిన్, తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పింది. సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ లో విజయవంతమైన కెరీర్ నిర్మించిన క్యాథరిన్, 2010లో విడుదలైన శంకర్ ఐపీఎస్ అనే కన్నడ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది.


ఆ తరువాత 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలోని పాత్ర ద్వారా ఆమె అందరికీ మరింత దగ్గరైంది. ఈ సినిమా తర్వాత ఆమెకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చాయి. సరైనోడు సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. అందులో ఎమ్మెల్యే పాత్రలో బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళంలో కూడా క్యాథరిన్ కి మంచి గుర్తింపు ఉంది.


మద్రాస్ సినిమా లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అలా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ పిక్ లో ఆమె తన కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, తన జీవిత ప్రయాణంలో మరింత ఆనందాన్ని పంచుకుంటోంది. ఇక అమ్మడు తెలుగులో చివరగా వాల్తేరు వీరయ్యాలో స్పెషల్ గా కనిపించింది. అంతకుముందు బింబిసార సినిమాతో బిగ్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఒక తమిళ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నట్లు టాక్. అలాగే వెబ్ సీరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

Tags:    

Similar News