దేశంలో ఖ‌రీదైన సెల‌బ్రిటీ విడాకులు

వంద‌ల కోట్లు భార్య‌కు భ‌ర‌ణంగా ముట్ట‌జెప్పిన సెల‌బ్రిటీ భ‌ర్త‌ల గురించి తెలుసుకోవాల్సిన విష‌యాలు ఉన్నాయి.

Update: 2025-01-10 18:30 GMT

సెల‌బ్రిటీల‌ విడాకుల గురించి నిరంత‌రం వార్త‌లు వింటున్నాం. చాలామంది ఫేజ్ 3 జంటలు క‌ల‌త‌ల కార‌ణంగా విడిపోయారు. అయితే కోర్టు తీర్పు మేర‌కు జీవిత భాగస్వామికి భరణంగా భారీగా చెల్లించుకున్న స్టార్లు చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నారు. హృతిక్ రోషన్ - సుస్సేన్ ఖాన్ జంట విడాకులు దేశంలో అత్యంత ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. వంద‌ల కోట్లు భార్య‌కు భ‌ర‌ణంగా ముట్ట‌జెప్పిన సెల‌బ్రిటీ భ‌ర్త‌ల గురించి తెలుసుకోవాల్సిన విష‌యాలు ఉన్నాయి.


హృతిక్ రోషన్-సుసానే ఖాన్ జంట 2014లో విడిపోయారు. ఈ ఇద్ద‌రూ చిన్న నాటి స్నేహితులు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 15ఏళ్లుపైగా సంసారం స‌జావుగా సాగింది. వీరికి ఇద్ద‌రు కిడ్స్ ఉన్నారు. సుస్సానే త‌న భ‌ర్త హృతిక్ నుంచి భరణంగా రూ. 400 కోట్లు డిమాండ్ చేసింది. 380 కోట్లు చెల్లించార‌ని ప్ర‌చార‌మైంది. కేవ‌లం ఈ జంట మాత్ర‌మే కాదు.. ఇంకా ప‌లు జంట‌లు ఇదే తీరుగా విడిపోయారు. భార్య‌ల‌కు భ‌ర్త‌లు భ‌ర‌ణం చెల్లించారు.


ప‌టౌడీ సంస్థాన అధినేత‌, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్- న‌టి అమృతా సింగ్ జంట 13ఏళ్ల దాంప‌త్య జీవ‌నం త‌ర్వాత విడిపోయారు. అత‌డు త‌న మొద‌టి భార్య అమృత‌కు భరణంగా భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఆ మొత్తం ఎంత అనేది వారు వెల్లడించలేదు. సైఫ్‌ సంపదలో దాదాపు సగం చెల్లించాల్సి ఉంటుంద‌ని గుసగుసలు వినిపించాయి. సైఫ్ త‌న భార్య‌కు రూ.5 కోట్లు భరణం ఇవ్వాలని వార‌సుడు ఇబ్రహీంకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు 1 లక్ష ఇవ్వాల్సి ఉంటుంద‌ని కోర్టు తీర్పు వెలువ‌రించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.


సంజయ్ కపూర్-కరిష్మా కపూర్ విడాకులు కూడా కాస్ట్ లీ ఎఫైర్ గానే ముగిసింది. ఈ జంట‌ ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. ఇద్దరూ తమ 13 సంవత్సరాల వివాహ బంధాన్ని ముగించారు. సంజయ్ తండ్రి నివాసం(ఇల్లు)పై హ‌క్కుల‌ను యాజమాన్యాన్ని క‌రిష్మా తన పేరుకు బదిలీ చేయించుకుంది. ఆమె బాండ్ల నుండి నెలవారీ రూ. 10 లక్షల వడ్డీని కూడా అందుకుంటోంది. త‌న‌ పిల్లల పేర్ల మీద 14 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.


మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ బ్రేక‌ప్ గురించి తెలిసిందే. ఈ జంట‌ 13 సంవత్సరాల వైవాహిక జీవితం అనంత‌రం విడిపోయారు. మలైకా రూ.10 కోట్ల‌ నుంచి 15 కోట్ల మేర భరణం తీసుకుందని సమాచారం. నటుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌ ఫర్హాన్ అక్తర్- అధునా భబానీ 16 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికారు. 2016 లో ఈ జంట‌ విడిపోయారు. ఫర్హాన్ నెలవారీ భత్యానికి బదులుగా వన్-టైమ్ భరణం మొత్తాన్ని చెల్లించాడు. అధునా 10000 చదరపు అడుగుల భవనం `విపాసన`ను కూడా ద‌క్కించుకుంది. ఫ‌ర్హాన్ ఇటీవ‌ల మ‌రొక న‌టి శిభాని దండేక‌ర్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News