సెల‌బ్రిటీ బ్రాండ్ వ్యాల్యూ లో ఎవ‌రి ర్యాంక్ ఎంతంటే?

అన్నిప‌రిశ్ర‌మ‌ల‌కంటే బ్రాండ్యూ వ్యాల్యూలో ఎల్ల‌ప్పుడూ ఉత్త‌రాది తార‌లే ముందు వ‌రుస‌లోన‌ని మ‌రోసారి ప్రూవ్ అయింది

Update: 2024-07-26 12:36 GMT

అన్నిప‌రిశ్ర‌మ‌ల‌కంటే బ్రాండ్యూ వ్యాల్యూలో ఎల్ల‌ప్పుడూ ఉత్త‌రాది తార‌లే ముందు వ‌రుస‌లోన‌ని మ‌రోసారి ప్రూవ్ అయింది. 2023 క్రోల్ సెలబ్రిటీల బ్రాండ్ వ్యాల్యూ లో స‌త్తా చాటిన సెల‌బ్రిటీలు ఎవ‌రంటే? మొద‌టి స్థానంలో క్రికెట్ దిగ్గ‌జం విరాటో కొహ్లీ నిలిచాడు. భార‌త‌దేశంలో టాప్ బ్రాండ్ ఇమేజ్ తో 227.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూ తో తొలిస్థానం ద‌క్కించుకున్నాడు. 40 బ్రాండ్ల‌ను ఎండార్స్ చేస్తున్నాడు.

ఆ త‌ర్వాత స్థానంలో బాలీవుడ్ స్టార్ ర‌ణ‌వీర్సింగ్ నిలిచాడు. 23.1 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో రెండవ స్థానం ర‌ణ‌వీర్ కి ద‌క్కింది. అత‌డు తన పోర్ట్ ఫోలియాలో 50 బ్రాండ్లను కలిగి ఉన్నాడు. ఇక మూడ‌వ స్థానంలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నిలిచాడు. 120.7 మిలియ‌న్ బ్రాండ్ వ్యాల్యూతో కొన‌సాగు తున్నాడు. నాల్గ‌వ స్థానంలో కిలాడీ అక్ష‌య్ క‌మార్ ఉన్నాడు. 111.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో అత‌డికి స్థానం ద‌క్కింది.

ఇక హీరోయిన్ల నుంచి అలియాభ‌ట్, దీపికా ప‌దుకొణే ఈ జాబితాలో నిలిచారు. ఐదవ స్థానంలో 101.1 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఆలియా భట్ ఉంది. అలాగే దీపికా పదుకొనే 96 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఆరవ స్థానంలో నిలిచింది. మాజీ క్రికెటర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ 95.8 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఏడవ స్థానంలో ఉన్నాడు. ఎనిమిద‌వ స్థానంలో క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ 91.3 మిలియ‌న్ డాల‌ర్ల బ్రాండ్ విలువ‌తో నిలిచాడు.

తొమ్మిద‌వ స్థానంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ నిలిచారు. 83.6 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఆయ‌న‌కు ఈస్థానం ద‌క్కింది. అలాగే స‌ల్మాన్ ఖాన్ 81.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ప‌ద‌వ స్థానాన్నిద‌క్కించుకున్నాడు.

Tags:    

Similar News