ప‌ప్ప‌న్నం ఎప్పుడు పెడతారో?

కోటీ ఆశ‌ల‌తో కొత్త ఏడాదికిలోకి అడుగు పెట్ట‌డానికి సెల‌బ్రిటీలంతా రెడీ అవుతున్నారు

Update: 2023-12-29 13:30 GMT

కోటీ ఆశ‌ల‌తో కొత్త ఏడాదికిలోకి అడుగు పెట్ట‌డానికి సెల‌బ్రిటీలంతా రెడీ అవుతున్నారు. గ‌తం గ‌త‌హా..భ‌వి ష్య‌త్ బాగుండాల‌ని ఎన్నో క‌ల‌లు కంటున్నారు. మ‌రికొన్ని జంట‌లు వివాహాల‌కు వేళాయెనే అంటూ ముందొస్తు ప్లానింగ్ తోనూ క‌నిపిస్తున్నారు. మ‌రి ఈ జోడీలు 2024 లోనైనా వివాహ బంధంతో ఒక‌ట‌వుతారా? లేక ఇంకా ప్రేమ పాఠాలు నేర్చుకుంటారా? అన్న‌ది చూడాలి. ఇంత‌కీ ఆ జోడీలు ఏంటి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.


మిల్కీబ్యూటీ త‌మ‌న్నా-బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ ల‌వ్ లో ఎంత సీరియ‌స్ గా ఉన్నారో తెలిసిందే. ఇప్పుడీద్ద‌రి వ్య‌వ‌హారమంతా ప‌బ్లిక్. ఏం చేసినా అంద‌రికీ చెప్పే చేస్తున్నారు. కానీ పెళ్లి మాట ఎత్తేస‌రికి స‌రైన క్లారిటీ ఇవ్వ‌లేదు. విజ‌య్ రెడీగా ఉన్నా..త‌మ‌న్నా మాత్రం వెన‌క్కి లాగిపెడుతున్న‌ట్లు నిన్న‌టివ ర‌కూ ఉన్న స‌మాచారం. మ‌రి కొత్త ఏడాది లో మ‌న‌సు మర్చుకుని మూడు వేయించుకుంటుందా? అన్న‌ది చూడాలి.

ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్-నిర్మాత జాకీ భ‌గ్నానీ ప్రేమ కి చాలా వ‌య‌సే క‌నిపిస్తుంది. పెళ్లి చేసుకుంటార‌ని గ‌తేడాదినుంచి మీడియాలో క‌థ‌నాలు త‌ప్ప ఇంత‌వ‌ర‌కూ ఆ ఘ‌ట్టం చోటు చేసుకోలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రియుడు గురించి ప్ర‌త్యేకంగా చెబుతుంది గానీ..పెళ్లి గ‌డియ‌లు ఎప్పుడ‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. ఇటీవలే జాకీ పుట్టిన రోజుని ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసింది. జీవితంలో మ‌ర్చిపోలేని ఓ గిప్ట్ కూడా ఇచ్చింది.

అలాగే శ్రుతి హాస‌న్-శంత‌న్ హ‌జారికా రిలేష‌న్ షిప్ గురించి తెలిసిందే. ప్రేమ‌లో తొలిసారి వైఫ‌ల్యం చెందినా రెండ‌వ సారి మాత్రం అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తో ముందుకెళ్తుంది శ్రుతి హాస‌న్. ఈ నేప‌థ్యంలో శంత‌న్ తో వివాహం ఎప్పుడు జ‌రుగుతుందా? అని అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఇక తాప్సీ-మాథ్యూస్ బోయ్ కూడా సీరియ‌స్ రిలేష‌న్ షిప్ లో ఉన్నారు. ఈ వ్య‌వ‌హారంలో కాస్త సీక్రెట్స్ మెయింటెన్ చేస్తున్న‌ప్ప‌టికీ ఏదో రూపంలో జోడీ ముచ్చ‌ట్లు నెట్టింట చ‌క్కెర్లు కొడుతున్నాయి.

మ‌రి ఆ రిలేష‌న్ షిప్ ని అక్క‌డికే ప‌రిమితం చేస్తారా? పెళ్లి వ‌ర‌కూ తీసుకెళ్తారా? అన్న‌ది చూడాలి. ఇక యువ నాయిక అన‌న్యా పాండే-ఆదిత్యా రాయ్ క‌పూర్ తో డేటింగ్ లో ఉంది. వెకేష‌న్లు..పార్టీలంటూ జోరుగానే లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు. క‌పూర్ బోయ్ కి గ‌తంలోనూ కొన్ని ఎఫైర్లు ఉన్నాయి. మ‌రి ఈ రిలేష‌న్ షిప్ అందులో ఒక‌టి అవుతుందా? పెళ్లి వ‌ర‌కూ తీసుకెళ్తారా? అన్న‌ది చూడాలి. అలాగే అర్జున్ క‌పూర్-మ‌లైకా ఆరోరా ల‌వ్ స్టోరీ గురించి తెలిసిందే. వివాహం చేసుకుంటారా? ప్రేమికులుగా మిగిలిపోతారా? అన్న టాపిక్ రోజు నెట్టింట చ‌ర్చ‌గానే క‌నిపిస్తుంది. మ‌రి 2024 లో నైనా ఆ క‌థ‌నాలకు పుల్ స్టాప్ పెడ‌తా రేమో చూడాలి.

Tags:    

Similar News