వీడియో: కోయంబత్తూర్ ట్రాక్‌లో చైతన్య కార్ రేసింగ్!
మార్కెట్లోకి కొత్త బ్రాండ్ కార్ ఏదైనా దిగింది అంటే వెంటనే దానిని కొనేస్తాడు.
లగ్జరీ బ్రాండ్ కార్లను కొనడం వాటిలో షికార్ చేయడం నాగచైతన్య ప్యాషన్. అక్కినేని బుల్లోడికి ప్రత్యేకించి కార్ రేసింగ్, కార్ల కలెక్షన్ విషయంలో ఆసక్తి ఉంది. కింగ్ నాగార్జున వారసుడిగా చైతన్యకు కార్లంటే విపరీతమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్త బ్రాండ్ కార్ ఏదైనా దిగింది అంటే వెంటనే దానిని కొనేస్తాడు. ఇప్పటికే చై గ్యారేజీలో చాలా లగ్జరీ బ్రాండ్ కార్లు ఉన్నాయి.
ఇటీవలే నాగ చైతన్య తన లగ్జరీ కార్ కలెక్షన్‌కి 3.51 కోట్ల రూపాయల విలువైన పోర్షే 911 GT3 RSని జోడించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఇప్పుడు
కోయంబత్తూరులో మషాబుల్ ఇండియా (Mashable India) కార్ రేస్ షూటింగ్‌లో యువసామ్రాట్ చై అక్కినేని పోర్షే కార్ తో ట్రాక్ మీదకు వెళ్లిన స్నీక్ పీక్ ని షేర్ చేసారు. ట్రాక్ రేస్ క్షణాలను సంగ్రహించడం! అంటూ వారు దీనికి అందమైన క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియోలో పోర్షే కొత్త బ్రాండ్ గురించి హోస్ట్ వర్ణిస్తున్న తీరు.. నాగచైతన్య ట్రాక్ పై దూసుకెళుతున్న విధానం ప్రతిదీ హైలైట్ గా కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియోని చై అభిమానులు వైరల్ గా షేర్ చేస్తున్నారు. కోయంబత్తూర్ ట్రాక్‌లో చైతన్య కార్ రేసింగ్! అభిమానులకు ఆసక్తిని కలిగించింది.
నాగ చైతన్య వద్ద ఫెరారీ, BMW వంటి లగ్జరీ బ్రాండ్ కార్ కలెక్షన్ ఉంది. ఇటీవల అతడు తన గ్యారేజ్‌కు సిల్వర్ పోర్స్చే 911 GT3 RSని జోడించాడు. Cartrade.com ప్రకారం, భారతదేశంలో పోర్షే 911 GT3 RS ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.51 కోట్లు. ఈ కారు 17 మే 2024న రిజిస్టర్ అయింది. హైదరాబాద్‌లోని మొదటి పోర్షే 911 GT3 RS నాగ చైతన్య సొంతం అయింది. చైతూ తన కొత్త కారును నగరం చుట్టూ తిప్పుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
నాగ చైతన్య కార్ కలెక్షన్స్ లో.. ఫెరారీ 488GTB (RS 3.88 కోట్లు), BMW 740 Li (RS 1.30 కోట్లు), 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ (RS 1.18 కోట్లు), నిస్సాన్ GT-R (RS 2.12 కోట్లు) వంటి కార్లు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ G-Class G 63 AMG (RS 2.28 కోట్లు), MV అగస్టా F4 (RS 35 లక్షలు), BMW 9RT (RS 18.5 లక్షలు).. చాలా కీలకమైనవి.
నాగ చైతన్య -సాయి పల్లవి జంటగా నటిస్తున్న `తండేల్` ఈ సంవత్సరం థియేటర్లలో విడుదల కానుంది. కార్తికేయ ఫేం చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.