పాన్ ఇండియా సినిమా ముహూర్తం పెట్టేశారు..!

చందు మొండేటితో కలిసి ప్రేమం, సవ్యసాచి సినిమాలు చేసిన నాగ చైతన్య థర్డ్ సినిమాగా ఇది చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నాగ చైతన్య మేకోవర్ అదిరిపోయింది.

Update: 2023-12-09 06:20 GMT

అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్ లో చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా తండేల్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నారని తెలుస్తుంది. మొన్నటివరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించిన మేకర్స్ నేడు సినిమాకు ముహూర్తం పెట్టుకున్నారు.

విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున అతిథులుగా వచ్చి తండేల్ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా ఆడియన్స్ ని సైతం మెప్పించిన చందు మొండేటి తండేల్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు. ఇక కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ అక్కినేని హీరోల్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు నాగ చైతన్య.

చందు మొండేటితో కలిసి ప్రేమం, సవ్యసాచి సినిమాలు చేసిన నాగ చైతన్య థర్డ్ సినిమాగా ఇది చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నాగ చైతన్య మేకోవర్ అదిరిపోయింది. సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మ్యాన్ గా కనిపించనున్నారు. అందుకు తగినట్టుగా గుబురు గడ్డంతో మాస్ లుక్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారు. నాగ చైతన్యతో 100% లవ్ సినిమా చేసిన గీతా ఆర్ట్స్ ఆ సినిమాతో అతనికి మొదటి సూపర్ హిట్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తండేల్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుందో చూడాలి. రీసెంట్ గా నాగ చైతన్య దూత అనే వెబ్ సీరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలతోనే కాదు వెబ్ సీరీస్ లతో కూడా నాగ చైతన్య ఆడియన్స్ ని మెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న చందు మొండేటి తండేల్ కోసం బాగా వర్క్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇన్ని భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Full View
Tags:    

Similar News