దేవర 'చుట్టమల్లే'.. చెడు గాలి ఎంత వీచినా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి రెండు రోజుల క్రితం సెకండ్ సింగిల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది

Update: 2024-08-08 06:25 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి రెండు రోజుల క్రితం సెకండ్ సింగిల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చుట్టమల్లే అనే ఈ సాంగ్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే 40 మిలియన్ వ్యూవ్స్ ని ఈ సాంగ్ సొంతం చేసుకుంది. అన్ని భాషలలో కూడా సెకండ్ సింగిల్ కి మంచి ఆదరణ లభిస్తోంది.

ముఖ్యంగా ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ చాలా అందంగా, గ్లామరస్ గా కనిపించింది. సాంగ్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సాంగ్స్ లలో ఇది ఒకటనే మాట వినిపిస్తోంది. ఓ వైపు సాంగ్ కి మంచి ప్రశంసలు లభిస్తూనే మరో వైపు విమర్శలు కూడా వస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ ఈ సాంగ్ ట్యూన్ కాపీ చేసారంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

రెండు పాటలని కలిపి వీడియోగా చేసి వైరల్ చేస్తున్నారు. ట్యూన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. శ్రీలంకకి చెందిన ప్రైవేట్ సాంగ్ మానికే మగే హైతే ని కాపీ చేసి చుట్టమల్లే సాంగ్ ని అనిరుద్ రవిచందర్ చేశారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అనిరుద్ పై జరుగుతున్న ఈ ట్రోలింగ్ పై ఒరిజినల్ సాంగ్ ని కంపోజ్ చేసి చంపత్ సంగీత్ రియాక్ట్ అయ్యారు.

నా సాంగ్ అనిరుద్ రవిచందర్ ని ఇన్స్పైర్ చేసిందంటే చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ సాంగ్ విషయంలో తనకి ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొన్నాడు. మొత్తానికి ఈ కాపీ క్యాట్ వివాదం చుట్టమల్లే సాంగ్ కి మరింత హైప్ తీసుకొని వస్తోంది. ట్రోలింగ్ అనే చెడు గాలి ఎంత వీచినా చుట్టమల్లే సాంగ్ కు బ్రేక్ వేయలేకపోతున్నారు అని కామెంట్స్ వస్తున్నాయి.

దీంతో వ్యూవ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సాంగ్ ఎలా ఉందో చూడాలని నెటిజన్లు ప్రయత్నం చేస్తున్నారు. దేవర మూవీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కి కూడా మంచి ఆదరణ లభించడంతో సినిమాపైనే ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మూవీ రిలీజ్ కూడా దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఈ వివాదం కూడా సినిమాకి ఓ విధంగా హెల్ప్ అవుతోందనే మాట వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి పాన్ ఇండియా మూవీగా దేవర వస్తోంది. కొరటాల శివ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Tags:    

Similar News