ఈత రాదు.. సముద్రంలో షూటింగ్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సాయి పల్లవి క్రియేట్ చేసుకుంది.

Update: 2025-02-04 05:02 GMT

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సాయి పల్లవి క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం అవుతోంది. ఇన్నేళ్ల ప్రయాణంలో హీరోయిన్ గా స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు వచ్చిన కూడా ఆ పాత్రలు తనకి నచ్చకపోవడంతో వదిలేసుకుంది. నటిగా బలమైన ముద్ర వేసే సినిమాలు మాత్రమే చేసింది. హీరో ఎవరైనా స్టోరీ నచ్చితేనే సాయి పల్లవి చేస్తుందనే ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

అలాగే తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సాయి పల్లవి క్రియేట్ చేసుకుంది. ఆమె కోసమే సినిమాలు చూసే ఆడియన్స్ చాలా మంది సౌత్ లో ఉన్నారు. ఆమె సినిమాలో చేస్తుంది అంటే ఆ మూవీస్ పైన ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. అంతలా సాయి పల్లవి ఇంపాక్ట్ ఉంటుంది. సినిమాలలో మాత్రమే కాకుండా బయట కూడా చాలా నార్మల్ లుక్ లో కనిపిస్తుంది. తాను స్టార్ హీరోయిన్ అనే ఫీలింగ్ ఎక్కడా చూపించదు.

అందుకే చాలా మంది ఆమెని అభిమానిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో కూడా చాలా మంది దర్శకులు, హీరోలు, నిర్మాతలు సాయి పల్లవి అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఆమెతో సినిమాలు చేయనివారు కూడా ప్రత్యేకంగా అభిమానిస్తూ ఉంటారు. బోల్డ్ కంటెంట్ తో సినిమాలు చేసే సందీప్ రెడ్డి వంగా లాంటి వారు సైతం సాయిపల్లవిని అభిమానించడం విశేషం. ఇదిలా ఉంటే ఆమె నాగ చైతన్యకి జోడీగా నటించిన ‘తండేల్’ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్స్ లోకి వస్తోంది.

ఈ సినిమాపైనే పాజిటివ్ వైబ్ నడుస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డైరెక్టర్ చందూ మొండేటి సాయి పల్లవి బిహేవియర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవికి ఎవరూ అసిస్టెంట్స్ ఉండరు. షూటింగ్ లో కూడా ఆమె పెద్దగా మ్యాకప్ వేసుకోదు. జస్ట్ సన్ స్క్రీన్ రాసుకొని వచ్చేస్తుంది. అలా చూసినపుడు ఈవిడ హీరోయినేనా అని అనిపిస్తుంది.

ఆ గుంపులో కూర్చుంటే అందరిలో కలిసిపోతుంది. ఆమెని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అస్సలు ఏమీ పట్టించుకోదు. ట్యాన్ అవుతున్నాను, కాలు డామేజ్ అవుతున్నాయి. ఏదైనా వచ్చి కాటేస్తుందేమో, సముద్రంలో జారిపోతే, చనిపోతామేమో అనే భయాలు ఏవీ ఉండవు. ఒక సీన్ కోసం చిన్న పడవ వేసుకొని సముద్రంలోకి వెళ్లాం. అక్కడ ఆమె సముద్రంపై చేపల కోసం వల వేయాలి.

అవతలి వైపు టెక్నీషియన్స్ అందరూ భయపడిపోతున్నారు. ఈత వచ్చా అంటే రాదని చెప్పింది. అయిన భయం లేకుండా నటించేది. అక్కడ ఈత వచ్చిన సముద్రంలో పడితే ఏమీ చేయలేని పరిస్థితి. కెమెరా ముందుకి వచ్చేసరికి అంతగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి నటిస్తుంది. ఆమెని చూస్తున్నప్పుడు తెలియకుండా నాకు నేనే హ్యాపీగా ఫీల్ అయిపోతునేవాడినాని చందూ మొండేటి సాయి పల్లవి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News