చందూ మొండేటి నెక్ట్స్ ఎవరితో?
ఈ సక్సెస్ ఇచ్చిన ఆనందంలో చందూ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఆలోచించారు.
కార్తికేయ2 సినిమాతో డైరెక్టర్ చందూ మొండేటి పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తాను చాటిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ ఇచ్చిన ఆనందంలో చందూ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఆలోచించారు. కార్తికేయ2కు కొనసాగింపుగా కార్తికేయ3 తన చేతిలో ఉన్నప్పటికీ ఆ సినిమా మొదలుపెట్టే లోపు ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనుకున్నాడు చందూ.
ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్ లో ఓ సినిమాకు కమిట్ అయిన చందూ, అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఓ కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడు. చందూ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు కానీ ఎప్పుడు చేద్దామనేది మాత్రం చెప్పలేదు. అలా సూర్య డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న చందూ దగ్గరకు తండేల్ కథ వెళ్లింది.
ఎలాగూ సూర్య తో సినిమాకు లేటవుతుంది కదా అనుకున్న చందూ, నాగ చైతన్య తో తండేల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి, మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. తండేల్ సక్సెస్ తర్వాత ఇప్పుడు మళ్లీ చందూ ఎవరితో సినిమా చేస్తాడనేది ప్రశ్నగా మారింది. ఆల్రెడీ కథ చెప్పి ఓకే చేయించుకున్న సూర్యతో ముందుకెళ్తాడా లేదా కార్తికేయ3ను మొదలుపెడతాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఆల్రెడీ పలు సినిమాలతో బిజీగా ఉన్న సూర్య ఇప్పటికైనా చందూకు డేట్స్ ఇస్తాడా? చందూకి సూర్య డేట్స్ ఇచ్చే దాన్ని బట్టి చందూ నెక్ట్స్ మూవీ ఏంటనేది తేలనుంది. అన్నీ కుదిరి సూర్య డేట్స్ దొరికినా, సూర్య తెలుగులో వెంకీ అట్లూరితో కూడా సినిమా చేయడానికి ఓకే అన్నాడని వార్తలొస్తున్నాయి. మరి ఈ రెండింటిలో సూర్య ముందు ఏ సినిమా చేస్తాడో తెలియాల్సి ఉంది.
ఒకవేళ సూర్యకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరదని పక్షంలో చందూ మొండేటి నిఖిల్ తో కార్తికేయ3 కానీ, లేదంటే వేరే ఏదైనా సినిమా కానీ చేసే ఛాన్సుంది. ఏదేమైనా చందూ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడన్నది తెలియాలంటే మరో నెల రోజుల వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం చందూ తండేల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.