NBK అన్‌స్టాప‌బుల్ సెట్లో బావ CNB

`అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4` డబుల్ ధ‌మాకా ట్రీట్ ని అందించేందుకు రెడీ అయింది. కొత్త సీజ‌న్ తాజాగా ప్రారంభ‌మైంది.

Update: 2024-10-20 14:02 GMT

`అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4` డబుల్ ధ‌మాకా ట్రీట్ ని అందించేందుకు రెడీ అయింది. కొత్త సీజ‌న్ తాజాగా ప్రారంభ‌మైంది. మూడు సీజ‌న్లు అద్భుతంగా అల‌రించాయి. ప్ర‌పంచంలోనే 18వ బెస్ట్ షోగా ఐఎండిబి ర్యాంకింగ్ ని ఇవ్వ‌డం గ‌ర్వ‌కార‌ణం. అలాగే దేశంలోనే పాపుల‌ర్ షోగాను అన్ స్టాప‌ప‌బుల్ విత్ ఎన్బీకే రికార్డుల‌కెక్కింది. బాలకృష్ణ త‌ప్ప మ‌రెవ‌రూ ఇలాంటి షోని హోస్ట్ చేయ‌లేర‌ని ఇటీవ‌ల విడుద‌లైన‌ ట్రైల‌ర్ న‌మ్మ‌కాన్ని పెంచింది. సోషల్ మీడియాలో అభిమానులందరూ ట్రైలర్‌కు ఫిదా అయ్యారు. ప్ర‌శంస‌లు కురిపించారు.

తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగ‌వ‌ సీజన్‌కు మొదటి అతిథిగా హాజరయ్యారు. షో సెట్స్ లో చంద్రబాబు నాయుడు అడుగుపెట్ట‌గా బాలకృష్ణ ఆయ‌న‌ను సాధ‌రంగా స్వాగతించారు. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా OTTలో ప్ర‌సారం అవుతున్న ఈ షో మొద‌టి సీజ‌న్ పెద్ద స‌క్సెసైంది. ఇప్పుడు సీజ‌న్ 4ని పెద్ద స‌క్సెస్ చేసేందుకు ఆహా అధినేత అల్లు అర‌వింద్ తో క‌లిసి ఎన్బీకే అద్భుత‌మైన ప్లానింగ్ ని న‌డిపిస్తున్నారు. మొద‌టి ఎపిసోడ్ కే ఏకంగా ముఖ్య‌మంత్రిని బ‌రిలో దించారు. బాల‌య్య‌కు బావ గారు గ‌నుక ఎపిసోడ్ ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

సీజ‌న్ 4లో న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌లోని కొత్త కోణం చూస్తార‌ని ఇటీవ‌ల ట్రైల‌ర్ లాంచ్ లో ఆయ‌న కుమార్తె తేజ‌స్విని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. సీజ‌న్ 4 ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని కూడా అన్నారు. ఈ షోకు పని చేస్తున్న టీమ్ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే..అల్లు అరవింద్ (ఆహా నిర్వాహ‌కుడు), అనిల్ రావిపూడి (సినిమా దర్శకుడు), తేజస్విని నందమూరి (అన్‌స్టాపబుల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్), అజిత్ ఠాకూర్ (ఆహా దర్శకుడు), రవికాంత్ సబ్నవిస్ (ఆహా CEO), రాజీవ్ చిలక (గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు).

ఈ సీజ‌న్ లో బాలకృష్ణ తన బోల్డ్ లుక్ , కొత్త పాత్రలో కనిపించారు. యానిమేటెడ్ ప్రోమో కోసం జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఆకర్షణీయమైన సంగీతం అల‌రించింది. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ``ప‌లు షోలను హోస్ట్ చేయమని చాలా మంది నన్ను సంప్రదించారు కానీ నేను అంగీకరించలేదు. మరొకరు అడిగితే ఈ షో చేయను. అరవింద్‌గారు నన్ను అడగడం వల్లే ఈ షో చేయాల‌నుకున్నాను`` అని అన్నారు.

Tags:    

Similar News