సినీ గేయ రచయిత చంద్రబోస్‌కి డాక్టరేట్
సమావేశంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనా రెడ్డి, డా.ఎన్ సుమన్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.ఆర్.ఆర్ నాటు నాటుతో భారతదేశానికి ఆస్కార్ (ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరీ)ని అందించిన ప్రముఖ సినీ గేయరచయిత కునుకుంట్ల సుభాష్ చంద్రబోస్‌కు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంత సాగర్ శివారులోని ఎస్సార్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈనెల 16న నిర్వహించనున్న ప్రథమ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ పట్టా ప్రదానం చేయనున్నట్టు విశ్వవిద్యాలయం కాన్వకేషన్ కమిటీ చైర్మన్ సి.వి గురురావు ప్రకటించారు.
ఎస్సార్ విశ్వ విద్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబోస్ 29ఏళ్ల కెరీర్ జర్నీలో 3600 పైగా పాటలు రాసారని పరిశ్రమలో చెరగని ముద్ర వేసారని పేర్కొన్నారు. స్నాతకోత్సవంలో డిగ్రీ, డాక్టరేట్ ప్రదానంతో పాటు పూర్వ విద్యార్థులకు పెద్ద ఎత్తున సత్కార కార్యక్రమం ఉంటుందని సివి గురురావు వెల్లడించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనా రెడ్డి, డా.ఎన్ సుమన్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రథమ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ అనీల్ డి.సహస్రబుధే.. (ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ షనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్.. ఎన్ఏఏసి , బెంగళూరు) ముఖ్య అతిథిగా పాల్గొననుండగా, ప్రఫెసర్ దీపక్ గార్గ్ (ఎస్సార్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్), ఏ వరదా రెడ్డి, ఎస్సార్ యూనివర్శిటీ ఛాన్సలర్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.