బికినీలో చితక్కొట్టుడు పాప.. గుర్తుపట్టారా..?

ప్రస్తుతం అందాల భామల గ్లామర్ షోకి ఇన్ స్టాగ్రామ్ మంచి వేదికగా మారింది.

Update: 2024-05-24 07:46 GMT

ప్రస్తుతం అందాల భామల గ్లామర్ షోకి ఇన్ స్టాగ్రామ్ మంచి వేదికగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అమ్మాయిలూ మోడలింగ్ లోకి అడుగుపెట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలోకి నటీమణులుగా అడుగుపెడుతున్నారు. ఇలా ఎంట్రీ ఇచ్చేవారిలో కొంతమంది మంచి సక్సెస్ లు అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ గా మారుతున్నారు. మరికొంతమంది స్టార్ హీరోయిన్స్ కాకపోయిన ఒకటి, రెండు సినిమాల ద్వారా ఫేమ్ సంపాదించుకొని దాంతో ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ గా మారిపోతున్నారు.


హీరోయిన్ అనే ఇమేజ్ వారికి లక్షల్లో ఫాలోవర్స్ ని తెచ్చిపెడుతుంది. దానికి తోడు ఇన్ స్టాగ్రామ్ లో చేసే గ్లామర్ షోతో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో రంగుల ప్రపంచంలో దర్శక, నిర్మాతల దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తున్నారు.. అలాగే ఫాలోవర్స్ ని పెంచుకొని లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. విదేశాలలో పుట్టి పెరిగిన ఇండియన్ బ్యూటీస్ కూడా భారత్ లోకి అడుగుపెట్టి హీరోయిన్స్ గా రాణించాలని అనుకుంటున్నారు. ఇక ఆ రూట్లో చంద్రిక రవి కూడా కొనసాగుతోంది.

ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఇండియన్ బ్యూటీ చంద్రిక రవి అంటే అందరికి తెలియకపోవచ్చు. కానీ బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి సాంగ్ లో ఐటెం బ్యూటీగా నటించిన భామ అంటే వెంటనే గుర్తుపడతారు. ఈ అమ్మడు మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి తమిళంలో ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు సినిమాతో నటిగా అడుగుపెట్టింది.

తరువాత సెయి మూవీలో నటించింది. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఘోస్ట్ క్యారెక్టర్ లో చంద్రిక రవి ఈ చిత్రంలో కనిపించింది. వీరసింహారెడ్డి సినిమాలో ఐటెం సాంగ్ తో అందరికి చేరువ అయ్యింది. అలాగే బాలీవుడ్ టూ హాలీవుడ్ అనే ఇంగ్లీష్ చిత్రంలో చంద్రిక రవి నటించింది.

ప్రస్తుతం అమ్మడు సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరో సారి చంద్రిక రవి ఏకంగా బికినీలో ఘాటైన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్లాక్ స్విమ్ షూట్ లో ధరించి చేతిలో వైన్ బాటిల్ పట్టుకొని స్టైలిష్ గా ఫోజులిచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News