రూ.20 కోట్ల నుంచి రూ.5 కోట్లకు... ఛాంపియన్ నిలిచేనా?
గడచిన నాలుగు సంవత్సరాలుగా బాలీవుడ్ పరిశ్రమ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది
గడచిన నాలుగు సంవత్సరాలుగా బాలీవుడ్ పరిశ్రమ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏడాదికి రెండు మూడు సినిమాలు మినహా భారీ విజయాలు సాధిస్తున్న సినిమాలే కనిపించడం లేదు. భారీ హైప్ తో రూపొందిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
స్టార్ హీరోల సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది కనీసం పాతిక కోట్ల వసూళ్లను రాబట్టలేక ఢీలా పడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన 'చందు ఛాంపియన్' సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ వారంలో విడుదల అవ్వబోతున్న ఈ ఛాంపియన్ కి మినిమం అడ్వాన్స్ బుకింగ్ అవ్వడం లేదు.
చిత్ర యూనిట్ సభ్యులు భారీగా ఖర్చు చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడంతో పాటు, అనేక ప్రమోషనల్ ఈవెంట్స్ చేసి, భారీగా ఖర్చు చేసినా కూడా దక్కిన హైప్ మాత్రం జీరో అన్నట్లుగా పరిస్థితి మారిందని బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రూ.20 కోట్ల ఓపెనింగ్ ఖాయం అంటూ మేకర్స్ మొదటి నుంచి చాలా నమ్మకంగా కనిపిస్తూ వచ్చారు. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే అంత సీన్ లేదు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నమోదు అయిన అడ్వాన్స్ బుకింగ్ లెక్కల ప్రకారం మొదటి రోజు రూ.5 కోట్లు రాబట్టడం గొప్ప విషయం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా పారా ఒలింపిక్ లో బంగారు పతకం సాధించిన మురళీ కాంత్ పెట్కర్ బయోపిక్ అనే విషయం తెల్సిందే. సినిమాను ఒక మంచి కమర్షియల్ మూవీగా రూపొందించినట్లుగా ప్రమోషన్స్ చేశారు. అయినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు.
సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ జరగకున్నా కూడా పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు కొత్త నమ్మకం పెట్టుకున్నారు. మరి విడుదల తర్వాత అయినా ఈ సినిమా ఛాంపియన్ గా నిలిచేనా అనేది చూడాలి.