నాన్న, బాబాయ్‌ల‌తో కాదు మామ‌తో చ‌ర‌ణ్ పార్టీ

అంటే క‌చ్ఛితంగా 'మామ' అయితేనే పార్టీకి స‌రిజోడు అని చాలామంది కుర్రాళ్లు ఒప్పుకుంటారు.

Update: 2025-01-05 07:42 GMT

యూత్ పార్టీకి వెళ్లాలంటే వారి ప్రాధాన్య‌త ఎలా ఉంటుంది? నాన్న‌తో లేదా బాబాయ్‌లు, మామ .. ఎవ‌రితో క‌లిసి వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు? అంటే క‌చ్ఛితంగా 'మామ' అయితేనే పార్టీకి స‌రిజోడు అని చాలామంది కుర్రాళ్లు ఒప్పుకుంటారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా అందుకు అతీతుడు కాదు.

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షోలో హోస్ట్ బాల‌కృష్ణ అడిగిన ఓ చిలిపి ప్ర‌శ్న‌కు చ‌ర‌ణ్ ఇచ్చిన స‌మాధానం అంతే ఆస‌క్తిని క‌లిగించింది. చ‌ర‌ణ్ తండ్రి గారైన‌ చిరంజీవితో క‌లిసి బాబాయ్ లు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో చూపించి.. వీళ్ళ ముగ్గురిలో పార్టీకి వెళ్లాలంటే ఎవరితో వెళ్తావు? అని హోస్ట్ ఎన్బీకే అడిగారు. దీనికి చరణ్ స్పందిస్తూ.. ముగ్గురితో వెళ్ళను. మా మామతో వెళ్తాను. మామ అరవింద్ పార్టీకి బెస్ట్ అని అన్నారు.

అయితే చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీల‌కు దూరం. వారి స్థాయికి త‌గ్గ‌ట్టు హుందాగా ఉంటారు. అయితే అల్లు అర‌వింద్ మామ‌తో చ‌ర‌ణ్ త‌న సాన్నిహిత్యం ఎలా ఉంటుందో చెప్పేందుకే అలా స‌ర‌దాగా వ్యాఖ్యానించార‌ని అర్థ‌మ‌వుతోంది. నిజానికి మామ కూడా వ‌య‌సు, అనుభ‌వాల‌ రీత్యా పెద్ద మ‌నిషి. అలాంటి వారితో పార్టీలు కుదురుతాయా? షోలో త‌న ప‌క్క‌నే ఉన్న స్నేహితుడు శ‌ర్వాతో అయితే పార్టీ బాగా సెట్ట‌వుతుందేమో! ప్ర‌స్తుతం మామ అర‌వింద్ గురించి చరణ్ స‌ర‌దా వ్యాఖ్యలు వెబ్ లో వైరల్ అవుతున్నాయి.

ఇదే ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్ కుమార్తె క్లిన్ కారాను ఎప్పుడు అంద‌రికీ చూపిస్తారు? అని హోస్ట్ ఎన్బీకే ప్ర‌శ్నించారు. క్లిన్ త‌న‌ను 'నాన్న' అని పిలిచిన‌ప్పుడు అంద‌రి ముందుకు తీసుకు వ‌స్తాన‌ని చ‌ర‌ణ్ ప్రామిస్ చేసారు. 2025లో ఒక మ‌గ‌బిడ్డను త‌మ‌కు కానుక‌గా ఇవ్వాల‌ని చ‌ర‌ణ్ ని త‌న‌ కుటుంబ స‌భ్యులు కోరుకున్న విష‌యాన్ని కూడా ఒకే 'లేఖ' ద్వారా బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌భాస్ పెళ్లెప్పుడు? అంటూ చ‌ర‌ణ్ ని బాల‌య్య ప్ర‌శ్నించిన విధానం ఆక‌ట్టుకుంది. ఇక ఈ ప్రోమోలో.. చరణ్ తల్లి, నానమ్మ మాట్లాడిన వీడియోను చూపించారు. ఈ వేదిక‌పై గేమ్ ఛేంజర్ కు కావాల్సినంత ప్ర‌మోష‌న్ కూడా చేసారు. పూర్తి ఎపిసోడ్ ఆహాలో 8 జ‌న‌వ‌రి సాయంత్రం 7గం.ల‌కు స్ట్రీమింగ్ కానుంది.

Tags:    

Similar News