చిరంజీవి గారిలో మంచి లక్షణాలన్నీ చరణ్‌లో
మంచు మనోజ్ ఈటీవీ విన్ కోసం 'ఉస్తాద్' అనే టాక్ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యువ నటుడు శర్వానంద్ ఈ షోలో అదరగొట్టాడు.
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మంచు మనోజ్- శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆ ఇద్దరూ వారి గురించి ఏం మాట్లాడారు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
మంచు మనోజ్ ఈటీవీ విన్ కోసం 'ఉస్తాద్' అనే టాక్ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యువ నటుడు శర్వానంద్ ఈ షోలో అదరగొట్టాడు. ఈ సందర్భంగా హోస్ట్ మనోజ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించాడు. మనోజ్ మాట్లాడుతూ "చిరంజీవి గారి గొప్పతనం గురించి గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనని నమ్ముకున్న వారందరికీ అండగా నిలుస్తున్నారు" అని అన్నారు.
ఆయన ఎల్లప్పుడూ తన వారికి అండగా ఉంటారు.. హ్యాట్సాఫ్. చిరంజీవి గారి నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. పవర్ ఫుల్ మెగాస్టార్‌కి పెద్ద ఎత్తున చప్పట్లు కొడదాం.. అని మనోజ్ వ్యాఖ్యానించాడు. దానికి శర్వానంద్ స్పందిస్తూ.. "చిరంజీవి గారిలానే రామ్ చరణ్ కూడా తన వాళ్లను చూసుకుంటాడు. అతడు అవసరమైన వారికి అండగా ఉంటాడు. అతనిలాంటి వ్యక్తి నా కోసం ఉన్నాడని నేను గర్వంగా చెప్పగలను. చరణ్ స్నేహితుడు కావడం నా అదృష్టం. చిరంజీవి గారికి ఉన్న అన్ని మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి" అని అన్నాడు.
చిరంజీవి, రామ్ చరణ్ గురించి మనోజ్, శర్వానంద్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్‌కి శర్వానంద్ చిన్ననాటి స్నేహితుడు. శర్వానంద్ శంకర్ దాదా ఎంబీబిఎస్ లో ఒక అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తర్వాత హీరోగా ఎదిగాడు. మంచు మనోజ్ 'వాట్ ది ఫిష్' చిత్రంతో తిరిగి కంబ్యాక్ ని ఘనంగా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు.