బాప్‌రే.. క్లిన్ కారాకు గుర్రం పిల్ల కానుక‌..!

క్యూట్ డాట‌ర్ క్లిన్ కారాకు రామ్ చ‌ర‌ణ్ ఇచ్చిన కానుక గురించి తెలిసాక చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Update: 2024-08-23 17:30 GMT

చాలామంది ఖ‌రీదైన కానుక‌లు అందుకుని ఉండొచ్చు. కానీ ఇలాంటి అరుదైన కానుకను అందుకుని ఉండ‌రు. అలాంటి ఒక గొప్ప అదృష్టం మెగా వార‌సురాలు, రామ్ చ‌ర‌ణ్ కుమార్తె క్లిన్ కారాను వ‌రించింది. క్యూట్ డాట‌ర్ క్లిన్ కారాకు రామ్ చ‌ర‌ణ్ ఇచ్చిన కానుక గురించి తెలిసాక చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చ‌ర‌ణ్ త‌న కుమార్తెకు గుర్రం పిల్ల‌ను కానుక‌గా ఇచ్చారు.

ఇటీవ‌ల ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న కుమార్తె రాహాకు 250 కోట్ల విలువైన భ‌వంతిని కానుక‌గా ఇచ్చాడ‌ని తెలుసుకున్నాం. చాలా మంది స్టార్ హీరోలు త‌మ కుమార్తెలు లేదా కుమారుల‌కు ఖ‌రీదైన కానుక‌లు ఇచ్చారు. కానీ అందుకు భిన్నంగా.. ఎంతో ద‌య ప్రేమ హృద‌యంతో కూడుకున్న కానుక‌ను చ‌ర‌ణ్ త‌న కూతురికి ఇచ్చాడని అభిమానులు భావిస్తున్నారు.

కేవ‌లం గుర్రం పిల్ల‌ను కానుక‌గా ఇస్తే దానిని అంత‌గా ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. ఆ గుర్రం పిల్ల వెన‌క స్టోరి తెలిస్తేనే ఉత‌కంఠ పెరుగుతుంది. నిజానికి క్లిన్ కి కానుకిచ్చిన‌ది మామూలు గుర్రం పిల్ల కాదు. `మ‌గ‌ధీర` స్వారీ చేసిన గుర్రానికి వార‌సురాలు. ఈ విష‌యాన్ని హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రామ్ చరణ్ తన గారాల‌ప‌ట్టీకి ఇచ్చిన ప్రత్యేక బహుమతి గురించి వెల్ల‌డించాడు. స్వ‌త‌హాగా పెట్స్ ని అమితంగా ఇష్ట‌ప‌డే రామ్ చ‌ర‌ణ్ తన ఇంట్లో వాటికి పెద్ద స్థానం క‌ల్పించాడు. త‌న ఇంటి పెర‌డు- జూలో కుక్క పిల్ల‌లే కాదు.. ర‌క‌ర‌కాల ప‌క్షులు, జంతువులు కూడా ఉన్నాయి. అందులో `మ‌గ‌ధీర`(చ‌ర‌ణ్ బ్లాక్ బ‌స్టర్ మూవీ) గుర్రం జ‌న్మ‌నిచ్చిన గుర్రం పిల్ల కూడా పెరిగి పెద్ద‌ద‌వుతోంది. దానిని ఇప్పుడు క్లిన్ కారాకు ఎంతో ప్రేమ‌గా కాన‌నుక‌గా ఇచ్చాడు చ‌ర‌ణ్‌. ``జంతువుల‌పై నాకు అప‌రిమిత‌మైన ప్రేమ ఉంది. అందుకే ఇది నా కుమార్తెకు సరైన బహుమతి అని నేను అనుకున్నాను. క్లిన్ ఈ గుర్రంపై స్వారీ చేయడం చాలా ఇష్టం`` అని చ‌ర‌ణ్‌ అన్నాడు.

గత సంవత్సరం రామ్ చరణ్ తన కొత్త గుర్రం బ్లేజ్‌ను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. తాను గుర్రంతో ఉన్న అద్భుతమైన ఫోటోల‌ను షేర్ చేసాడు. రామ్ చరణ్ తన అశ్వ కుటుంబానికి ఈ కొత్త చేరిక గురించి చెబుతూ ఎగ్జ‌యిట్ అయ్యాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజ‌ర్ లో న‌టిస్తున్నాడు. ఎస్.శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, జయరామ్, సునీల్ , సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామాలోను చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News