'ధృవ 2' సెట్స్‌పైకి! ఇంతకీ చరణ్ ఏమన్నారు?
అదే సమయంలో మోహన్ రాజా తనిఒరువన్ 2 కాన్సెప్టును చరణ్ కి వినిపించాడు. కానీ చరణ్ తని ఒరువన్ సీక్వెల్లో నటించేందుకు ఆసక్తిగా లేనని తెలిపాడట.
ప్రతిభావంతుడైన దర్శకుడు మోహన్ రాజా తన బ్లాక్ బస్టర్ సినిమా తనిఒరువన్ కి సీక్వెల్ ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో రామ్ చరణ్ ధృవ 2లో నటిస్తారా? అంటూ అభిమానులు ప్రశ్నించారు. తనిఒరువన్ రీమేక్ అయిన ధృవ చిత్రాన్ని సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమా సీక్వెల్ వస్తే బావుంటుందని మెగాభిమానులు ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు.
కానీ రామ్ చరణ్ ఆలోచనలు వేరొకలా ఉన్నాయని తాజాగా రివీలైంది. నిజానికి తని ఒరువన్ 2 చిత్రీకరణ ప్రారంభించక ముందే చరణ్ తో ధృవ2 కూడా సైమల్టేనియస్ గా ప్రారంభిస్తే బావుంటుందని మోహన్ రాజా భావించారట.ఈ ప్రతిపాదనను చరణ్ ముందు ఉంచినా కానీ ప్రాజెక్ట్ ఓకే కాలేదని తెలిసింది. ధృవ2లో వెంటనే నటించే ఆలోచన లేదని దర్శకుడికి తెలిపారట.
ప్రస్తుతం శంకర్- గేమ్ ఛేంజర్ పై పూర్తిగా దృష్టి పెట్టిన చరణ్ తదుపరి బుచ్చిబాబు సన సినిమాలో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడు. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రత్యేక మూవీ అని తెలిసింది. నిజానికి చరణ్ కి ఇప్పటికే విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథ వినిపించారు కానీ అది ఓకే కాలేదు. దీంతో అతడి సినిమాని చరణ్ తిరస్కరించాడు. కన్నడ ఫిలింమేకర్ నర్తన్ నుండి స్క్రిప్ట్‌లను కూడా చరణ్ తిరస్కరించాడని తెలిసింది.
అదే సమయంలో మోహన్ రాజా తనిఒరువన్ 2 కాన్సెప్టును చరణ్ కి వినిపించాడు. కానీ చరణ్ తని ఒరువన్ సీక్వెల్లో నటించేందుకు ఆసక్తిగా లేనని తెలిపాడట. అయితే దీనికి కారణాలను ఇప్పుడు అభిమానులు అన్వేషిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ ఇమేజ్ అమాంతం మారింది. ఇప్పుడు అతడు గ్లోబల్ స్టార్. పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటడం తనకు తెలుసు. తదుపరి గేమ్ ఛేంజర్ తో నిరూపించే పనిలో ఉన్నాడు. గేమ్ చేంజర్ కూడా ఆర్.ఆర్.ఆర్ తరహాలోనే లార్జర్ దేన్ లైఫ్ పాత్రతో రూపొందుతోందన్న టాక్ ఉంది. అంటే బుచ్చిబాబు సినిమా తర్వాత చేసేది ఏదైనా లార్జర్ దేన్ లైఫ్ పాత్ర అయి ఉండాలని అతడు భావిస్తున్నారనే సందేహం నెలకొంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ వేగం తగ్గించి తాపీగా పని చేయడానికి కారణం ఏమిటో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.