చరణ్-ఉపాసన.. మెల్‌బోర్న్ మెరుపులు
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) ఉత్సవంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకున్నారు
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) ఉత్సవంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకున్నారు. చరణ్ ప్రస్తుతం మెల్ బోర్న్(ఆస్ట్రేలియా) పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భార్య ఉపాసనతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఇవన్నీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్‌గా నియమితుడైన రామ్ చరణ్ మెల్ బోర్న్ సినిమా ఉత్సవంలో భారత జాతీయ జెండాను ఎగురవేయడం చారిత్రాత్మకం.
ఈవెంట్ నుంచి వచ్చిన ఫోటోల్లో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కామినేని కొణిదెలతో కలిసి రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న దృశ్యాలు అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఫోటోల్లో చరణ్, ఉపాసన ఇద్దరూ డీసెంట్ సూట్లలో ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఈవెంట్ లో ప్రవేశించేప్పుడు చరణ్, ఉపాసన ఫోటోగ్రాఫ్‌లకు పోజులిచ్చి, అభిమానులు మీడియా నుంచి చీర్స్ పొందారు. ముఖ్యమైన కార్యక్రమాలకు రామ్ చరణ్‌తో పాటు తరచుగా వచ్చే ఉపాసన ఈ వేడుకకే హైలైట్ అయ్యారు. ఉపాసన బాస్ లేడీ వైబ్స్ గురించి ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మీడియా సహా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న వీడియో కూడా వైరల్ అయింది. చరణ్ ఎంతో వినయంగా అన్ని మీడియాల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కనిపించారు. రామ్ చరణ్ తో అభిమానులు సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.
IFFM ఉత్సవాల్లో రామ్ చరణ్ కి అరుదైన గౌరవం దక్కింది. ఈ సంవత్సరం మెల్ బోర్న్ సినిమా పండుగలో భారతీయ కళ, సంస్కృతికి అంబాసిడర్ (ఆస్ట్రేలియా)గా ఎంపికైన చరణ్ కి గొప్ప గౌరవం దక్కింది. ఆ మేరకు జూలైలో ప్రకటన వెలువడింది. తన విధుల్లో భాగంగా రామ్ చరణ్ ఆగస్ట్ 17న ఐఎఫ్ఎఫ్ఎంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ డ్రామా `గేమ్ ఛేంజర్` విడుదల కావాల్సి ఉంది. తదుపరి బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఆర్‌సి17లోను నటించనున్నాడు.